అజొల్లాను పశువులకు చక్కని పోషకాహారం అని , ఆవు, గేదె, గొర్రెలు, మేక మరియు కుందేలు వంటి జంతువులకు మేతగ తినిపించవచ్చని అనేక అధ్యయనాలు చూపించాయి, ఎందుకంటే ఇది తేలికగా జీర్ణమవుతుంది (అధిక ప్రోటీన్ మరియు తక్కువ లిగ్నిన్ కారణంగా), దాణా సామర్థ్యం పెంచుతూ , పాల ఉత్పత్తిని 15-20% పెంచుతుంది అని నిరూపణలు ఉన్నాయి .
అజోల్లా ఎలాంటి వాతావరణంలో పెరుగుతుంది ?
అజొల్లా పెరగడానికి నీరు , కాంతి అవసరం (దీనికి 30-50% కాంతి అవసరం) అజొల్లా నీటి ఆధారిత పంట;
సరైన ఎదుగుదలకు చెరువులో కనీసం 5 అంగుళాల నీరు లోతు ఉండేలా చూడాలి.
ఆదర్శ ఉష్ణోగ్రత పరిధి 20-35°C. దీనికి నీటి pH విలువ 5 నుండి 7 మరియు అవసరం
80-90% తేమ శాతం అవసరం.
అజొల్లా సాగు:
1) ట్యాంక్ పరిమాణం పండించాల్సిన మేత పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. చిన్న హోల్డర్ల కోసం
2 మీటర్ల పొడవు మరియు 1 మీ వెడల్పు ఉన్న చెరువు సరిపోతుంది. నేల సమం చేసి
అవసరమైన పరిమాణంలో ఇటుకలు అమర్చాలి .
2) పాత ప్లాస్టిక్ సంచులు లేదా షీట్లను చెరువు అడుగున పెట్టాలి .
3) చెరువును 150 గేజ్ మన్నికైన ప్లాస్టిక్ షీట్లతో కప్పడం ఉత్తమం.
ఇది కుడా చదవండి
అధిక లాభాలు తెచ్చిపెడుతున్న మల్చింగ్ గురించి తెలుసా ?
4) సుమారు 25 కిలోల శుభ్రమైన ,సారవంతమైన మట్టిని చెరువు అంతటా ఒకే విధంగా వ్యాపించాలి
5) తర్వాత, 5 కిలోల ఆవుపేడ మరియు 30 గ్రా రాజ్ఫాస్/ముసూరీ ఫాస్ మిశ్రమాన్ని పూయాలి.
6) చెరువులో 10 సెంటీమీటర్ల లోతులో నీరు నింపాలి .
7) చెరువు యొక్క 1 చదరపు మీటరుకు 500గ్రా అజోల్లా కల్చర్ అవసరం అవుతుంది.
8) అజొల్లా 1-2 వారాలకు చెరువులో పూర్తిగా వ్యాపిస్తుంది అప్పుడు దానిని కోయడం ప్రారంభించవచ్చు
అజొల్లా పంట కోత
2-3 వారాలకు అజొల్లా కోతకు సిద్ధంగా ఉంటుంది. కూత కోసం ప్లాస్టిక్ జల్లెడలను ఉపయోగించవచ్చు లేదా చేతితోనే తీసేయొచ్చు.
. ఒక చెరువు నుండి రోజుకు సగటున 1 కిలోల అజోల్లా పంట పొందవచ్చు. పండించిన అజొల్లాను నేరుగా లేదా వేరే మేతతో కలిపి పశువులకు తినిపించవచ్చు. ఇది పశువులు, గొర్రెలు, మేకలు, పౌల్ట్రీ మొదలైన పశువులకు చక్కని పోషకాల మేత. అజొల్లా ను
పొడి రూపంలో కూడా ఆహారంగా ఇవ్వొచ్చు . పశువులకు పెట్టే ముందు ఆకులను మంచినీటితో శుభ్రం చేయాలి.
ఇది కుడా చదవండి
Share your comments