మారుతున్న కాలానికి అనుగుణంగా, రైతులు సంప్రదాయ పంటలను వదిలి కొత్త రకాల పంటలు చేప్పట్టవల్సిన అవసరం ఉంది. మన దేశంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి మరియు గోధుమ పంటలకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ, భిన్నమైన వాతావరణం మరియు నిలకడలేని దిగుబడి కారణంగా రైతులు కొన్ని సందర్భాల్లో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అన్ని కాలాల్లోని మెరుగైన దిగుబడినిచే మంచి లాభాలు అందించే పంటలు ఎన్నో ఉన్నాయి వాటిలో పుదీనా ఒకటి.
పుదీనా ఆకులకు, మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పుదీనా ఆకులను వంటకాల్లో వినియోగించడంతోపాటు, కొన్ని రకాల ఔషధాల్లోనూ, మరియు ఫుడ్ ఇండస్ట్రీ లో వినియోగిస్తారు. పుదీనా ఆకుల నుండి తీసిన నూనెకు ఎంతో డిమాండ్ ఉంది. పుదీనా నూనెకు ఉన్న ప్రత్యేక ఘాటైన లక్షణం, మరియు సువాసన ఈ డీమాండ్ రావడానికి కారణం, దీనిని కొన్ని ఖరీదైన పెర్ఫ్యూమ్లలోను వినియోగిస్తారు. ఇన్ని ప్రత్యేకతలనున్న పుదీనా సాగుకు అనువైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంఏఎస్ 1-
ఇది భారతదేశంలో విరివిగా సాగయ్యే వెరైటీలలో ఒకటి. ఈ రకం పుదీనా మొక్కలు దాదాపు 30-45 సెంటీమీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. దీనితోపాటుగా చీడపీడలను సమగ్రవంతంగా తట్టుకోగలిగే మేలైన రకం కాబ్బటి పురుగుమందులు మీద ఎక్కువుగా ఖర్చు చెయ్యవలసిన అవసరం ఉండదు. ఒకఎకరం నుండి సుమారు 100 క్వింటాల్ దిగుబడి లభిస్తుంది, అలాగే 70 కేజీల వరకు మెంథాల్ ఆయిల్ దిగుబడి పొందవచ్చు.
హైబ్రిడ్ 77-
ఇసుక నేలలకు మరియు పొడి వాతావరనానికి హైబ్రిడ్ 77 రకం ఎంతో అనువైనది. 50-60సెంటీమీటర్ల ఎత్తువరకు పెరిగే ఈ రకం అనేక రకాల తెగుళ్లను తట్టుకొని నిలబడగలదు. పుదీనాలో ప్రధానంగా వచ్చే ఆకుమచ్చ తెగులును తట్టుకొనే శక్తీ ఈ హైబ్రిడ్77 రకానికి ఉంది. ఒక ఎకరానికి 125 కిలోల దిగుబడిని పొందవచ్చు, దీనితోపాటు 65 కేజీల నునేను పొందవచ్చు.
శివాళిక్-
ఈ రకాన్ని చైనాకు చెందిన పుదీనా రకాల నుండి అభివృద్ధి చేసారు. శివళిక్ రకాన్ని ఒక్కసారి నాటితే రెండు సీసాన్ల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. దీనిని ఎక్కువుగా ఉత్తరప్రదేశ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికంగా సాగు చేస్తారు. కాకపోతే ఈ రకం తెగుళ్లు మరియు చీడలకు ఎక్కువుగా గురవుతుంది కాబట్టి ఈ రకాన్ని పండించే రైతులు తగిన జాగ్రత్తలు పాటించవలిసిన అవసరం ఉంది. ఒక ఎకరానికి దాదాపు 150 క్వింటాలా దిగుబడితోపాటు 90 కిలోల వరకు మెంథాల్ లభిస్తుంది.
కోసి-
కోసి రకం కేవలం 90 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. దీనితోపాటు తుప్పు తెగులు, ఆకు ముడత మరియు ఆకుమచ్చ తెగుళ్లను సమగ్రవంతంగా తట్టుకొని నిలబడగలదు. ఒక ఎకరానికి 200 క్వింటాల దిగుబడితోపాటు 100 కేజీల నూనె దిగుబడినిస్తుంది.
కుషాల్-
కుషాల్ రకాన్ని కొత్తగా అభివృద్ధి చెయ్యబడిన రకం, దీనిని టిష్యూ కల్చర్ పద్దతి ద్వారా అభివృద్ధి చెయ్యడం జరిగింది. 90-100 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది, కాబట్టి రెండు ప్రధాన పంటల మధ్య సాగు చేసేందుకు అనువుగా ఉంటుంది. దాదాపు పుదీనాలో వచ్చే అన్ని రకాల చీడపీడలను సమగ్రవంతంగా నివారించగలదు. ఈ రకం పుదినాను పంజాబ్ మరియు ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువుగా సాగు చేస్తారు. ఒక ఎకరం నుండి దాదాపు 150 క్వింటాల దిగుబడి మరియు 100 కిలో వరకు మింథల్ నూనె దిగుబడిని పొందవచ్చు.
Share your comments