Horticulture

అరటిలో వేయదగిన అంతర పంటలు మరియు చేయవలిసిన అంతర కృషి!

S Vinay
S Vinay

భారతదేశంలో అరటి ఉత్పత్తి ఉద్యాన వన పంటల్లో మొదటి స్థానంలో ఉంది.విస్టీర్ణంలో మామిడి , నిమ్మ జాతుల తరువాత మూడవ స్థానం ఆక్రమించి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అరటి తోటల పెంపకం విస్తారంగా సాగుతుంది. అయితే అరటిలో వేయదగిన అంతర పంటల గురించి మరియు అరటిలో చేయాల్సిన అంతర కృషి గురించి తెలుసుకుందాం.

కలుపు నియంత్రణ
మొదటి నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా కలుపు తీయడం ముఖ్యం. దీని కొరకై సాధారణంగా స్పేడింగ్ ఉపయోగించబడుతుంది
కలుపు మొక్కలను నియంత్రించడంలో సంవత్సరానికి నాలుగు స్పేడింగ్‌లు ప్రభావవంతంగా పని చేస్తాయి మరియు అవసరమైన చోట చేతితో కలుపు తీయడం ఉత్తమం.అరటి దిగుబడి మరియు నాణ్యతను ప్రభావితం చేయకుండా ముందుగా వచ్చే కలుపు మొక్కల నివారణకై డియురాన్ (1kg a.i./ha) లేదా గ్లైఫోసేట్ (2 kg a.i./ha) ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతర పంటగా అలసందలను పండించడం కూడా కలుపు నివారణలో తోడ్పడుతుంది.

అంతరపంటలు
అరటి తోట ఎదుగుదల తొలిదశలో అంతర పంటలను సులభంగా పెంచవచ్చు. కూరగాయలు,ముల్లంగి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర, మిరపకాయ, బెండకాయ, పొట్లకాయ, బంతి పువ్వు వంటి పంటలను విజయవంతంగా అంతర పంటలుగా వేసుకోవచ్చు. దక్షిణ భారత దేశంలో వక్క మరియు కొబ్బరి ఎక్కువగా వేయబడుతున్న అంతర పంటలు.

డీసక్కరింగ్
అరటి తన పంట కాలంలో అనేక పిలకలను (suckers) ఉత్పత్తి చేస్తుంది.ఇవి ఎక్కువగా ఉంటె రసం పీల్చే పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పిలకలను (suckers) తొలగించడం మంచిది. ఈ పక్రియను డి సకరింగ్ అంటారు.5-6 వారాల వ్యవధిలో ఈ సక్కర్‌లను తొలగించడం ద్వారా మొక్కల పెరుగుదలను వేగవంత చేయవచ్చు.

ప్రాపింగ్
ఈ పద్దతిని గాలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్వహిస్తారు. వీచే గాలులకు అరటి గెలలు రాలకుండా
వెదురు బొంగులతో ఆసరా ఇస్తారు.

మరిన్ని చదవండి

సీతాఫలం సాగుకు అనుకూలమైన వాతావరణం.. యాజమాన్య పద్ధతులు..

Share your comments

Subscribe Magazine