ఒక పంటను సాగు చెయ్యాలంటే, దాని ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అవసరమైనంత మొత్తంలో అందించాలి. పంట ఎదుగుదలకు మొత్తం మూడు పోషకాలు అవసరమవుతాయి, అవి నత్రజని, భాస్ఫారమ్ మరియు పోటాష్ ఎరువులు. వీటిలో ఏ ఒక్క పోషక లోపం తలెత్తిన పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పోషకాల ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవడం అవసరం. పంటల ఉత్పాదకతను పెంచడంలో పోటాష్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
మొక్క ఎదుగుదలకు పోటాష్ ఊతమిస్తుంది. మొక్కల్లో జరిగే జీవరసాయన క్రియలను నియంత్రించడంలో పోటాష్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొక్కలు తమ ఆహారాన్ని కిరణజన సంయోగక్రియ ద్వారా తయారుచేసుకుంటాయి, దీని ద్వారా ఏర్పడిన పిండి పదార్ధాలను మిగిలిన అన్ని భాగాలకు చేరవేయడంలో పోటాష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఆకులమీద ఉన్న పాత్ర రంద్రాలు తీర్చుకోవడానికి మరియు వివిధ జీవన క్రియల్లో దోహదపడే ఎంజైమ్లు చెతన్యవంతం చెయ్యడంలో కూడా పోటాష్ ఎంతో సహాయం చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఒక టన్ను పంట ఉత్పత్తి జరగాలంటే సుమారు 8-12 కిలోల పోటాష్ అవసరం ఉంటుందని తేలింది.
పోటాష్ పోషకాన్ని మొక్కల యొక్క పోలీస్ గా పరిగణిస్తారు, ఎందుకంటే మొక్కలను చీడపీడలనుండి కాపాడటంలో పోటాష్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వరి, మొక్కజొన్న, సజ్జలు వంటి మొక్కలు గాలికి పడిపోకుండా గట్టిగా ఉండాలంటే పోటాష్ ఎరువు చాలా అవసరం. గింజలు గట్టిబడటానికి మరియు నూనె గింజల్లో నూనె శాతం పెరగడానికి పోటాష్ ఎరువును తగిన మొత్తంలో వాడుకోవాల్సి ఉంటుంది. అధిక వర్షాలకు పంట నీటి ముప్పును గురైతే, పంట ఇనుప ధాతువు లోపానికి గురౌతుంది, ఈ లోపం తలెత్తకుండా పోటాష్ కాపాడుతుంది.
పప్పుజాతి మొక్కలు వాతావర్ణంలోని నత్రజని స్థిరికిస్తాయి, ఈ ప్రక్రియలో పోటాష్ ఎంతగానో తోడ్పడుతుంది. మొక్కలో పోటాష్ లోపం ఉన్నట్లైతే కొన్ని లక్షణాలను కనబరుస్తుంది. పోటాష్ లోపం ఉన్న మొక్కలో మొదట ఆకులు మొదట ఆకుపచ్చ రంగులోకి మారి క్రమేపి ఎండిపోతాయి. మొక్కఎదుగుదల లోపించడమే కాకుండా మొక్క యొక్క కాండం బలహీనపడిపోతుంది. పంట ఎదుగుదల తగ్గిపోయావడం వలన మొక్కలు గిడసబారిపోయి, దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. కనుక ఇటువంటి లోపాలు గమనించిన వెంటనే మొక్కకు అవసరమైనంత మోతాదులో పోటాష్ ఎరువులను అందించాలి.
పోటాష్ పంట యొక్క అన్ని దశల్లోనూ అవసరం ఉంటుంది, ముఖ్యంగా పంట ఏపుగా పెరిగే దశలో, గింజ ఏర్పడే దశలో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. మొక్క ఎదిగే సమయంలో కాండం గట్టిపడటానికి పోటాష్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పోటాష్ ను సేంద్రియ ఎరువుల ద్వారా కూడా అందించవచ్చు అయితే సేంద్రియ ఎరువుల్లో పోటాష్ లబ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎక్కువమొత్తంలో అందించాలి. పంట ప్రారంభించే ముందు భూసార పరీక్షలు చేయించడం తప్పనిసరి, భూసార పరీక్షల ద్వారా మట్టిలో పోటాష్ శాతం ఎంతుందో తెలుస్తుంది.
Share your comments