పెళ్లిళ్లు మరియు పండుగ సీసన్ వచ్చిందంటే పూలకు గిరాకీ పెరిగిపోతుంది. స్టేజి డెకరేషన్ లో ఉపయోగించే పూలలో జెర్బారా పూల్ ముఖ్యమైనవి. రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన పూలను సాగుచేసినట్లైతే మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఎక్కువుగా ఉంటుంది. జెర్బార సాగులో పాటించవలసిన పద్దతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలీ-హౌస్లో పూల సాగు:
జెర్బార పూలు సాగు చేసే రైతులు వీటిని పోలీ హౌసులలో సాగు చేయడం ఉత్తమమని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అయితే పోలీ హౌస్ లో సాగు చెయ్యాలంటే ప్రారంభంలో పెట్టుబడి కాస్త ఎక్కువుగానే ఉంటుంది, కాకపోతే ఈ పులకు ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉండటం, మార్కెట్లో మంచి ధర లభించడం ద్వారా, సాధారణ పంటలకంటే అధికంగా లాభాలు వచ్చే వీలుంటుంది. కొద్దీ పాటి భూమి కలిగి ఉన్న రైతులు కూడా, కొద్దిపాటి పెట్టుబడితో, ఎక్కువ లాభాలు పొందేవీలుంటుంది. ప్రభుత్వం కూడా ఎంఐడిహెచ్ స్కీం ద్వారా వీటి కట్ ఫ్లవర్ సాగుకు ఎన్నో రకాల ప్రోత్సహకాలను అందిస్తుంది. పాలీ-హౌస్ రక్షిత వాతావరణాన్ని కల్పిస్తుంది, దీని ద్వారా పంట నష్టపోయే అవకాశం చాల తక్కువుగా ఉంటుంది.
జెర్బార పులలోని రకాలు:
జెర్బారా పూలు అనేక రంగుల్లో అందుబాటులో ఉన్నాయి, వాటిలో తెలుపు, ఎరుపు, పసుపు, ఆరంజ్, స్కార్లెట్, ఇలా వివిధ రంగుల్లోని రకాలు అందుబాటులో ఉన్నాయి, రైతులు అన్ని రంగులను సాగు చెయ్యడం ద్వారా మార్కెట్లో మంచి ధర లభించడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిలో తెలుపు రకాలను వైట్ హౌస్ అని, పసుపు రంగు రకం పేరు సన్ వ్యాలి, ఎరుపు రంగు రకం పేరు, ఫ్రోబ్స్, ఇలా వేరువేరు రంగులకు వివిధ రకాల పేరులున్నాయి, రైతులు తాము సాగు చేసేటప్పుడు మేలైన రాకని ఎంచుకోవడం ఉత్తమం.
మట్టి తయారీ:
జెర్బార పులా సాగుకు ముందు, పాలీ హౌస్ లోని మట్టిని మొత్తం దున్ని చదును చేసుకోవాలి, ఈ మట్టికి ఒక ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును కూడా వేసి కలియ దున్నాలి. ఈ పూలను సాగు చెయ్యడానికి రైజ్డ్ బెడ్లను ఉపయోగించడం ఉత్తమం, దీని వలన కొన్ని రోగులను మరియు నీటి ముప్పు సమస్యను అరికట్టవచ్చు. ఈ బెడ్లు ఒక మీటర్ వెడల్పు మరియు 50 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారుచేసుకోవాలి.
ఈ బెడ్ల మీద, ప్రతి మొక్కకి మధ్య 35 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాటుకోవాలి. నర్సరీల నుండి నేరుగా మొక్కలను తెచ్చుకొని నాటుకోవడం మంచిది. మొక్క ఎదుగుదలకు సరైన వాతావరణ పరిస్థితులను కల్పించినట్లైతే ఏడాది పొడవున దిగుబడి పొందేందుకు వీలుంటుంది. మార్కెట్లో డిమాండ్ బట్టి ఒక్కో పువ్వును దాదాపు 12 రూపాయిల ధర వరకు విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి పంటను నాటుకుంటే సుమారు 3 ఏళ్ల వరకు దిగుబడి పొందేందుకు వీలుంటుంది.
Share your comments