Horticulture

పండ్ల ఎగుమతులలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్!

S Vinay
S Vinay

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 2021-22లో 18 మిలియన్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతాన్ని భారతదేశపు రైస్ బౌల్‌గా మార్చి, మత్స్య మరియు ఆక్వాకల్చర్ ఎగుమతుల్లో రోల్ మోడల్‌గా మారిన తర్వాత ఇప్పుడు  అత్యధిక పండ్ల ఉత్పత్తి తో అగ్రగామి రాష్ట్రంగా తన స్థానాన్నిఅంతర్జాతీయ మార్కెట్‌లో సుస్థిరం చేసుకుంది.

పండ్లను పండించే విధానంలో మెళకువలు మరియు వాతావరణాన్ని తట్టుకోగలవంగడాల  గురించి రైతుల్లో అవగాహన పెరిగింది. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవలి డేటా ప్రకారం, AP 2021-22లో 18 మిలియన్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా  మొత్తం 7.5 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగుకు కేటాయించింది.

ఏ రాష్ట్రంలోనూ లేనంతగా 2020లో AP 17 మిలియన్ టన్నుల పండ్లను ఉత్పత్తి చేసింది మహారాష్ట్ర 11 మిలియన్ టన్నులతో రెండవ స్థానంలో ఉంది. మొక్కల పెంపకంలో మార్పులు మరియు వాతావరణ పరిస్థితులపై అవగాహన పెరగడం వల్ల విశాఖపట్నం జిల్లా అంతర్భాగమైన చింతపల్లి మరియు లంబసింగిలో పండ్ల ఉత్పత్తి పెరిగింది. గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్ర మార్కెట్లలో స్థానికంగా పండే నారింజ, యాపిల్, స్ట్రాబెర్రీలు లభిస్తున్నాయి.

2021-22కి వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం, APలో 18 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. బొప్పాయి మరియు  నారింజ రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించే ప్రధాన పంటలు, అరటి మరియు మామిడితో  (ముఖ్యంగా బనగానపల్లె రకం.) పాటు కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, కాఫీ మరియు కొన్ని వాణిజ్య పంటలను ప్రోత్సహించడానికి వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖలు కృషి చేస్తున్నాయి.

కోల్డ్ స్టోరేజీ, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు అందించాలని రైతు సంఘాలు కోరుకుంటున్నాయి.

మరిన్ని చదవండి.

సీతాఫలం సాగుకు అనుకూలమైన దేశీయ, హైబ్రిడ్ రకాలు...!

Share your comments

Subscribe Magazine