దేశంలో ఎక్కువ శాతం జనాభా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. రక్తహీనతకు వయస్సుతో సంబంధం లేదు, పెద్దల నుండి పిల్లల వరకు అందరికి ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మనకు బలవర్థక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్ ) అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికొరకు కేంద్ర ప్రభుత్వం ఈ బలవర్ధక బియ్యాన్ని దేశంలో ఈ ఎఫ్ ఆర్ కె అందరికి అందించాలి అని నిర్ణయించుకుంది.
సాధారణ బియ్యంతో పోల్చుకుంటే ఈ బలవర్ధక బియ్యంలో ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. సాధారణ బియ్యంలో ఉన్న పోషకాలు ఉడికించినప్పుడు మరియు గంజి వార్చినప్పుడు పోతాయి. కానీ మనం ఈ బలవర్ధక బియ్యాన్ని ఉడికించినప్పుడు పోషాకాలు వ్యర్థం కావని, ఒకవేళ పోషకాలు పోయిన కానీ కేవలం 10 శాతం మాత్రమే పోతుందని చెప్పారు. ఈ ఎఫ్ఆర్కె బియ్యాన్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలు కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, పంజాబ్ నవతి ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ ను 98 శాతం బియ్యపు పిండికి కేవలం 2 శాతం ఖనిజాలను కలుపుతారు. ఈ మిశ్రమాన్ని 90 డిగ్రీల కన్నా తక్కువ వేడితో ఎక్స్ట్రుషన్ పద్దతి ద్వారా జెల్ గా మారుస్తారు. ఈ ప్రక్రియనే జెలటనైజేషన్ అంటారు. తరువాత దీనిని బియ్యం ఆకారంలోకి మారుస్తారు. దీనినే ఫోర్టిఫైడ్ రైస్ అంటారు. ఈ బలవర్ధక బియ్యం తయారీకి బీ 12 విటమిన్లు, ఐరన్, ఫోలిక్ ఆసిడ్ వంటి వివిధ రకాల ఖనిజాలను ఖచ్చిత నిష్పత్తిలో వాడతారు. ఎఫ్ఆర్కె సాధారణ బియ్యంతో కలిపి బలవర్ధక బియ్యాన్ని తయారుచేస్తారు.
ఇది కూడా చదవండి..
కివీ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!
ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నెల్స్ ను మనం తినే సాధారణ బియ్యంతో 1:100 నిష్పత్తిలో కలుపుతారు. అంటే దీని ప్రకారం ఒక కేజీ ఫోర్టీఫైడ్ రైస్ కెర్నల్ ను ఒక క్వింటా సాధారణ బియ్యంలో కలుపుతారు. ఈ బియ్యం అనేవి సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. మన జీవితంలో చాలా నిత్యావసర వస్తువులు అనేవి ఈ ఫోర్టిఫైడ్ పదడిలో చేసినవే. మనం నిత్యం వాడే నూనె, పాలు, గోధుమపిండి ఈ ఖనిజాలు కలిపి ఫోర్టిఫైడ్ పద్ధతుల్లో తయారుచేస్తారు.
కేంద్రం ఇప్పటికే మన దేశంలో ప్రజాపంపిణీ ( పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ) ద్వారా ప్రజలకు ఈ ఫారీటిఫైడ్ రైస్ ను అందజేస్తుంది. గత సంవత్సరం ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా మొత్తానికి 151 జిల్లాల్లో ఈ బలవర్ధక బియ్యాన్ని పంపిణి చేసింది. తెలంగాణా రాష్ట్రంలో పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకాలలో ఈ ఫోర్టిఫైడ్ రైస్ ని అందిస్తుంది. ఈ బలవర్ధక బియ్యాన్ని పంపిణి చేయడానికి భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో రేషన్ షాపులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో పిడిస్ ద్వారా ఈ బలవర్ధక బియ్యాన్నే పంపిణి చేయాలనీ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి..
Share your comments