మనిషి శరీరంలో ప్రతీ అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏ ఒక్క అవయవం సరిగ్గా పని చెయ్యకపోయిన సరే ఆ ప్రాభవం మొత్తం శరీరం మీద పడుతుంది. ఒక మనిషి అవయవ దానం చేస్తే చాలా మంది ప్రాణాలను నిలపవచ్చు. ఇంతటి విశిష్టత ఉన్న అవయవధానాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆగష్టు 13 న ప్రపంచ అవయవ ధాన దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇతరుల ప్రాణాలు కాపాడాంలన్న సదుద్దేశంతో ముందుకు వచ్చిన వారిని కూడా ఈ రోజు సత్కరిస్తారు.
అవయవ దానం ఒక ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టగలిగే మహత్తర కార్యం. ప్రతి ఏటా అవయవాలు పాడై, సరైన సమయానికి అవయవాలు దొరక్క ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి చనిపోయిన తరువాత అతని అవయవాలు వృధాగా మట్టిలో కలిసిపోకుండా, అవి నలుగురికి ఉపయోగపడాలి. ప్రపంచ వ్యాప్తంగా అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలియచేసే విధంగా ప్రతిఏడాది ఆగష్టు 13 న ప్రపంచ అవయవదాన దినోత్సవంగా నిర్వహిస్తారు. అవయవ దాన ఆవశ్యకత గురించి అవగహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజు అనేక కార్యక్రమాల ద్వారా అవయవ దాన ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తారు.
చాలా మందిలో అవయవదాన ప్రక్రియలో ఎన్నో అపోహలు ఉంటాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవయవదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి చైతన్యం తీసుకువస్తారు. అవయవదానం మీద అవగాహన కల్పించడంలో ఈ రోజు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్క వ్యక్తి అవయవ దానం చెయ్యడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది వ్యక్తులకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడి కొత్త జీవితాన్ని ప్రసాదించాడనికి అవకాశం ఉంటుంది. వైద్యుల ప్రకారం ఒక వ్యక్తి అవయవ ధానాం చేస్తే దాదాపు 7 మంది కొత్త జీవితాన్ని ఇచ్చినవారవుతారని వైద్యులు చెబుతున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాముఖ్యతను తెలుసుకుని,ఇతరులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవయవ దానానికి సంబంధించిన అపోహలను నివృత్తి చేయడం ద్వారా మరింతమందికి అవయవదానంపై అవగాహన పెంచడమేకాకుండా లక్షలాది మంది జీవితాలను కాపాడవచ్చు.
Share your comments