ఎంత పెద్ద కోటీశ్వరుడైన ఉప్పు లేని ఆహారం తినడు అన్నది ఒకప్పటి మాట, ఇప్పుడు ట్రెండ్ మారింది, ఉప్పు ఉన్న ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని ప్రచారం ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతుంది, దీనికి తగ్గట్టుగానే కొంత మంది ప్రజలు తమ ఆహారంలో ఉప్పును వాడటం పూర్తిగా మానేస్తున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం ఉప్పును పూర్తిగా మానెయ్యడం అంత మంచిది కాదని, ప్రతిరోజు కొద్దీ మొత్తంలోని ఉప్పు ఆహారంలో ఉండేలా చూడాలని పేర్కొంది, ఒక మనిషి ఒక రోజుకి ఐదు గ్రాముల ఉప్పు ఆహారం ద్వారా తీసుకోవాలని సూచించింది. ఉప్పు ఎక్కువుగా ఆహారానికి అలవాటు పడటం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మితంగా మాత్రమే ఉప్పును ఉపయోగించాలి.
ఈ మధ్య కాలంలో రాక్ సాల్ట్ వినియోగం పెరుగుతుంది, ఆరోగ్యానికి మంచిదని ప్రచారం జరగడంతో ప్రజలు కూడా ఈ ఉప్పును తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మనం సాధారణంగా ఉపయోగించే ఉప్పుతో పోలిస్తే రాక్ సాల్ట్ మరింత ఆరోగ్యకరమైనదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు, మరికొంత మంది ఎటువంటి ఉప్పును ఎంచుకోవాలో తెలియక సన్దిగ్నంలో పడుతున్నారు. ఈ సందేహాలకు చెక్ పెట్టె విధంగా, రాక్ సాల్ట్ మంచిదా లేదా సాధారణ ఉప్పు మంచిదా అన్న విషయాన్ని ఐసిఎంఆర్ స్పష్టం చేసింది.
ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి రెండు కొత్త రకాల ఉప్పు అందుబాటులోకి వచ్చాయి, ఏవి బ్లాక్ సాల్ట్ మరియు రాక్ సాల్ట్. ఈ రకం ఉప్పు ఆరోగ్యానికి మంచిదని వీటి వినియోగం పెరిగింది. వీటిలో రాక్ సాల్ట్ దీనినే పింక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఈ రకం ఉప్పులో పొటాషియం, కాల్షియమ్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి సహజలవణాలు అధికంగా ఉంటాయి. ఈ ఉప్పును సాధారణ ఉప్పులాగా రిఫైన్ చెయ్యరు కాబట్టి వీటిలోని ఖనిజవిలువలకు ఎటువంటి నష్టం వాటిల్లదు. అయితే ఈ రకం ఉప్పులో కూడా సాదారణ ఉప్పులాగానే సోడియం ఉంటుందని ఐసిఎంఆర్ తెలిపింది, కాబట్టి ఎన్ని పోషకవిలువలు ఉన్నాసరే ఈ రకం ఉప్పును కూడా మితంగానే తీసుకోవాలి.
ఉప్పు ఎక్కువుగా తింటే రక్తనాళాలపై పీడనం పడి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఏది గుండె సంభందిత వ్యాధులకు దారితియ్యవచ్చు. అధిక మొత్తంలో ఉప్పును తినడం ద్వారా జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతిని, జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఉప్పు తింటే మన శరీంలో సోడియం స్థాయి పెరిగిపోతుంది, దీనిని బయటకి పంపించడానికి కాలేయం ఎక్కువగా పనిచెయ్యవలసి ఉంటుంది, సోడియం తో పాటు శరీరం కాల్షియమ్ కూడా కోల్పోతుంది, దీని వలన ఎముకలకు సంబంధించిన వ్యాధులు తలైతే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఉప్పును నిర్ణిత మొత్తంలో తీసుకోవడం ఉత్తమం.
Share your comments