శరీరం వివిధ పోషకాలు మరియు ఖనిజాల సమ్మేళనం, వీటినుండి శక్తీ లభిస్తేనే శరీరం ముందుకు సాగుతుంది. శరీరానికి అవసరమైన పోషకాలతో ఏమైనా లోపాలు ఉంటే దాని ప్రభావం పూర్తి శరీరం యొక్క పూర్తి పనితీరు మీద పడుతుంది. శరీరానికి అవసరమైన పోషకాల్లో సోడియం అతి ముఖ్యమైనది. సోడియం శరీర అవసరాలకు సరిపడా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. అదే ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే చాలా ప్రమాదకరం.
సోడియం శరీరంలో అతిముఖ్యమైన పోషకం. శరీరంలోని రక్తనాళాల్లో అంతర్భాగమై, రక్త ప్రసరణలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త నాళాల నుండి కణాలకు పోషకాలను చేర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఉప్పు శరీరానికి అవసరమైన సోడియం అందిస్తుంది. అలాగని ఉప్పు అధికంగా తిన్నాసరే ప్రమాదకరమే. శరీరంలో సోడియం లెవెల్స్ ఎక్కువుగా ఉంటే హై బ్లడ్ ప్రెషర్, కిడ్నీ సమస్యలు మొదలైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఉప్పు పూర్తిగా మానేసినా ప్రమాదకరమే. శరీర అవసరాలకు అవసరమైన సోడియం లేకుంటే సోడియం ద్వారా జరిగే శరీర క్రియలన్ని నిలిచిపోతాయి.
శరిరంలో సోడియం లెవెల్స్ తగ్గిపోతే శరీరంపైనా తీవ్రమైన ప్రభావం పడుతుంది. సోడియం లెవెల్స్ తగ్గిపోతే నీరసం, కళ్ళు తిరగడం, బలహీనత, వాంతులు, తలనొప్పి మొదలైన సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు తీసుకున్న ఆహారం సరిగ్గా అరగక మలబద్ధకం కూడా రావచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ రావడం, మరికొన్ని సార్లైతే కోమాలోకి వెళ్లడం వంటివి జరగచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాణాలుకోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
సోడియం ఖనిజాన్ని మనం ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని నేరుగా ఉత్పత్తి చేసే శక్తీ శారీరానికి లేదు. శరీరానికి అవసరమైన ఎలెక్ట్రోలైట్లలో సోడియం అతి ముఖ్యమైనది. అయితే కొద్దీ పరిమాణంలో మాత్రమే సోడియం మన శరీరానికి అవసరం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఒక మనిషికి రోజుకి దాదాపు 5 గ్రాముల సోడియం అవసరం. ప్రతిరోజు కొద్దీ మొత్తంలో సోడియం మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలని ఎన్నో ఆరోగ్య పరిశోధన సంస్థలు చెబుతున్నాయి.
Share your comments