ప్రస్తుత కాలంలో రోజురోజుకు పెరిగి పోతున్న సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా అన్నంకి బదులుగా రోటిలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ విధంగా మధుమేహంతో బాధపడే వారు టెఫ్ తో చేసిన రోటీలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మొక్కల నుంచి లభించే ఈ టెఫ్ లో అధికంగా పోషక విలువలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, జింక్ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇతర ధాన్యాలతో పోల్చుకుంటే ఈ టెఫ్ లో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి టెఫ్ ఒక మంచి పదార్థం అని చెప్పవచ్చు.
ఇందులో ఎక్కువగా ఫైబర్,తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను సరైన క్రమంలో ఉంచడానికి దోహదపడతాయి. అందుకోసమే దీని ద్వారా తయారు చేసుకునే రోటీలను ఎక్కువగా మధుమేహంతో బాధపడే వారు తీసుకోవటంవల్ల వారి శరీరంలో చక్కెర స్థాయి సాధారణ స్థితిలో ఉంటాయి.
Share your comments