శరీరంలో అతిముఖ్యమైన భాగాల్లో పళ్ళు ఒకటి. పళ్ళు లేకుంటే, ఆహారం తినడం, తిన్న ఆహారం జీర్ణం కావడం రెండు కష్టమే. మన తీసుకున్న ఆహారం జీర్ణం కావడం మన నోటి నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి పళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే పళ్లకు సంబంధించిన ఎన్నో సమస్యలు కొంత మందిని తరచూ బాధిస్తూ ఉంటాయి. వాటిలో చిగుళ్ల నుండి రక్తం కారడం ఒకటి. మీరు బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ల నుండి రక్తం రక్తం వస్తున్నట్లైతే అది మొదటి దశ చిగుళ్ల వ్యాధులకు సంకేతం కావచ్చు.
చిగుళ్ల సమస్యలు ప్రారంభం కావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో మొదటిది ప్రతిరోజు సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం. సరిగ్గా బ్రష్ చేయకుంటే నోటిలోని బాక్టీరియా చిగుళ్ల మీద చేరి చిగుళ్ల వాపుకు మరియు రక్తం రావడానికి కారణమవ్వచ్చు. చిగుళ్ల సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం క్రమం తప్పకుండ బ్రష్ చేసుకోవాలి, దీనితోపాటు పళ్ళమధ్య పేరుకుపోయిన పాచిని ప్లాకింగ్ అంటే దారం సహాయంతో తొలగించాలి. దీనితోపాటుగా మరికొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పళ్ళ చిగుళ్ళను కాపాడుకోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏదైనా బ్రష్ కొనుగోలు చేసే ముందు వాటి బ్రిజిల్స్ కఠినంగా ఉన్నాయా లేదా మెత్తగా అని సరిచూసి తీసుకోవాలి. గట్టిగ ఉండే బ్రిజిల్స్ సున్నితమైన పళ్ళ చిగుళ్ళను దెబ్బతీసి, ఇలా రక్తం రావడానికి కారణమవుతాయి. కొన్ని రకాల మందులు రక్తం పలచబడేలా చేస్తాయి. రక్తం పలుచబడటం వలన చిగుళ్లు మీద కొత్త కణజాలం ఏర్పడుతుంది, ఈ కణజాలం సున్నితంగా ఉండటం వలన బ్రష్ చేసేటప్పుడు రక్తం వస్తుంది. మూర్ఛ వ్యాధికి వాడే మందులు, రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు చిగుళ్లు ఎదిగేలా చేసి రక్తస్రావం అయ్యేలా చేస్తాయి. ఇటువంటి మందులు వాడేవారు బ్రష్ చేసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.
సాధారణ వ్యక్తులకంటే పొగతాగేవారిలో చిగుళ్ల సమస్యలు రెండింతలు ఎక్కువ. పొగాకులోని కొన్ని రసాయనాలు, రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి, కాబట్టి చిగుళ్లులో బాక్టీరియా మరియు ఇతర ఇంఫెక్షన్లతో పోరాడే సామర్ధ్యం తగ్గిపోతుంది. ఇలా పొగ తాగడం వలన గాయపడిన చిగుళ్లు తొందరగా కోలుకోక దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ కాలం పొగతాగితే, అంత హాని ఉంటుంది కాబట్టి నోటీసమస్యలు ఉన్నవారు సిగ్గరేట్లు మానెయ్యడం మంచిది.
మధుమేహం ఉన్నవారికి కూడా చిగుళ్ల సమస్యలు ఎక్కువుగానే ఉంటాయి. ఎందుకంటే మధుమేహం వలన రోగనిరోధక శక్తీ తగ్గి నోటిలోని బాక్టీరియాతో పోరాడే సామర్ధ్యం తగ్గుతుంది. దీనివలన చిగుళ్ల వాపు, బ్రష్ చేసేటప్పుడు రక్తం రావడం గమనించవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా చిగుళ్ల సమస్యలు ఎక్కువగానే ఉంటాయి. గర్భిణీ స్త్రీలలో హార్మన్ల అసమతుల్యత వలన చిగుళ్లకు రక్త సరఫరా తగ్గి చిగుళ్ల ఎర్రబడతయి. దీనివలన పళ్ళమీద బాక్టీరియా చిగుళ్ళపై చేరి ఎక్కువుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలి, అలాగే పళ్ళను సర్రిగ్గా శుభ్రం చేసుకోవాలి.
Share your comments