తినగానే కూర్చోవడం లేదంటే పడుకోవడం మనలో చాలా మందికి ఈ అలవాటు ఉండే ఉంటుంది, అయితే ఇలా చెయ్యడం చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు మెరుగైన ఆరోగ్యం ఉండాలంటే తిన్నవెంటనే కాసేపు నడవటం అలవాటు చేసుకోండి. ఒకవేళ తిన్న తరువాత ఇలా నడిచే అలవాటు లేకుంటే ఇప్పటినుండే దీనిని అలవరచుకోండి. తిన్న తరువాత నడవడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తిన్నతరువాత నడిస్తే కడుపులోని కండరాలు, మరియు పేగులు ప్రేరిపించబడి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట కదలికలు మెరుగుపడటం వలన ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ వేగవంతమవుతుంది కాబట్టి, గుండెల్లో మంట, ఉబ్బరం, మలబద్దకం, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు, తిన్నతరువాత కూర్చోకుండా నడవటం అలవాటు చేసుకోవాలి, ఇలా నడవటం వలన శరీరానికి కాస్త వ్యాయామం లభించి రక్తంలోని చెక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రోజుమొత్తం రక్తంలో చెక్కెర స్థాయిలు మెరుగ్గా ఉంటాయి.
రక్తపోటు ఎక్కువుగా ఉన్నవారు భోజనం చేసిన తరువాత నడటం ప్రారంభిస్తే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నడవటం వలన రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది దీనివలన బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రపోకుండా కాసేపైనా బయట నడవాలి, దీనివలన శరీరానికి వ్యాయామం లభించడమే కాకుండా, మానశిక ప్రశాంతత కూడా దొరుకుంటుంది. నిద్రలేమి సమస్యలు దూరమై, మంచి ప్రశాంతవంతమైన నిద్ర లభిస్తుంది. అయితే తిన్నవెంటనే వేగంగా నడవటం మంచిది కాదు, నెమ్మదిగా నడిస్తే ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు మంచిది.
Share your comments