Health & Lifestyle

ఈ కూరగాయలు అతిగా తినొద్దు? ఎందుకో తెలుసా?

KJ Staff
KJ Staff
Vegetables
Vegetables

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమయ్యే పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కార్బోహైడ్రెట్స్, మాంసకృతుల‌ను అందేలా చూసుకోవాలి. దీని వల్ల శరీరం అనారోగ్యం బారినపడకుండా ఉంటుంది. అనేక రోగాలను సైతం తట్టుకునేలా రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అయితే, దీని కోసం పైన చెప్పిన పోషకాలు శరీరానికి సరిపడా అందాలంటే అవి లభించే పదార్థాలను నిత్యం ఆహారంగా తీసుకోవాలి. ఇవన్నీ లభించే పదార్థాల్లో మనం ముందుగా చెప్పుకోవాల్సినవి ఆకుకూరలు, తాజా కూరగాయలు ముందుంటాయి. వీటిలో శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే నిత్యం తాజా కూరగాయలతో చేసిన వంటకాలు ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.

అయితే, గతేడాది వెలుగు చూసిన కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఆరోగ్యం పై మరింత శ్రద్ద పెట్టారు. దీని కోసం రోగ నిరోధక శక్తిని పెంచే  ఆహారాన్ని తీసుకుంటున్నారు. కోంత మంది పోషకాలు అధికంగా ఉంటాయని చెప్పి మోతాదుకు మించి పలు కూరగాయలను ఆహారంగా తీసుకుంటున్నారు. దీని వల్ల ప్రయోజనాల కంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేఅవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలా అధికంగా తీసుకుంటే అనారోగ్యాన్ని కలుగజేసే కూరగాయల్లో క్యారెట్, క్యాబెజీ, కాలీప్లవర్, బీట్ రూట్ వంటివి ఉన్నాయి.

సాధారణంగా బీట్ రూట్ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరానికి పోషకాలు అందుతాయి. అలాగే, రక్తం శాతాన్ని పంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీనిని సలాడ్, వివిధ రకాల కూరలు, జ్యూసులు తయారీల రూపంలో తీసుకుంటారు. అయితే, దీనిని అతిగా తినడం వల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. ఎందుకంటే వీటిల్లో ఆక్సీలేట్ అధికంగా ఉంటుంది. క్యారెట్ ను సైతం అధికంగా తినడం వల్ల చర్మం రంగు, గోర్లు, చేతులు ఎర్రగా మారి.. అలర్జీకి దారితీస్తాయి. ఎందుకంటే క్యారెట్ లో బీటా కెరొటిన్‌‌ సహా పలు రకాల న్యూట్రియెంట్స్‌‌ ఉంటాయి. దీంతో క్యారెట్ ఎక్కువగా తింటే అవి రక్తంలో కలవవు. కాలీఫ్లవర్‌‌‌‌, బ్రొకోలిలు సైతం మరీ ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine