ప్రస్తుతం, UPI లావాదేవీలను డెబిట్ కార్డ్‌ల ద్వారా మాత్రమే చేయవచ్చు.అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోనుంది. పూర్తి వివరాలు చదవండి.
RESERVE BANK OF INDIA : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్‌లను UPI నెట్‌వర్క్‌లకు లింక్ చేయాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతానికి రూపే క్రెడిట్ కార్డులతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ తర్వాత మాస్టర్ కార్డ్, వీసా కార్డులు కూడా రానున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ప్రస్తుతం, UPI కస్టమర్ల డెబిట్ కార్డ్‌లను వారి సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలకు లింక్ చేయడం ద్వారా మాత్రమే లావాదేవీలను అనుమతిస్తుంది.
UPI లావాదేవీలు చెల్లింపులను సులభతరం చేశాయి. చాలా మంది కస్టమర్లు క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లను కలిగి ఉన్నారు. కార్డ్‌లతో చెల్లింపు ప్రక్రియ కొంచెం క్లిష్టంగా ఉంటుంది.. ప్రధానంగా కొనుగోలు సమయంలో కార్డును స్వైప్ చేసి OTP ని నమోదు చేయాల్సి ఉంటుంది.
మిగితా చెల్లింపు విధానాలతో పరిగణిస్తే UPI లావాదేవీలు చాలా సులభం. అందుకే ఎక్కువ మంది ప్రజలు దీన్ని ఉపయోగించడం ప్రారంభించారు, దీనికి మొబైల్ ఫోన్ మాత్రమే అవసరం. RBI గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నట్లుగా, మే 2022లోనే, UPI ద్వారా ₹ 10.40 లక్షల కోట్ల విలువైన 594.63 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి. ఇప్పటివరకు, UPI లావాదేవీలలో క్రెడిట్ కార్డ్‌లను వినియోగించే అవకాశం అందుబాటులో లేదు ప్రస్తుతం ఈ సేవలను క్రెడిట్ కార్డులకి కూడా విస్తరింపజేశారు.
మరిన్ని చదవండి.
పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని తెరవండి, ప్రతి నెలా 50 వేలకు పైగా సంపాదించండి!
పోస్టాఫీస్ పథకం: నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టి...రూ. 35 లక్షలు పొందండి!
Share your comments