ప్రస్తుతం వయసుతో సంభంధం లేకుండా ఎంతోమంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ కీళ్లనొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కీళ్ళనొప్పులకు మనం తీసుకునే ఆహారం, మరియు శారీరిక శ్రమలేకపోవడం కారణం కావచ్చు. కీళ్లనొప్పులు అశ్రద్ధ చేస్తే అవి ఎక్కువయ్యే ప్రమాదం లేకపోలేదు. కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆహారం ద్వారా కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందగలమో ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్లనొప్పులు తగ్గిచడంలో బ్లాక్ బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ వంటి ఎంతో ప్రభావితంగా పనిచేస్తాయి. ఈ బెర్రీలో యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో కలిగే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వీటితోపాటు, వంటింట్లో ఉపయోగించే పసుపు కూడా కీళ్ల నొప్పులకు ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ బాక్టీరియాల్ లక్షణాలతోపాటు, శరీరంలో వచ్చే వాపును కూడా తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది.
కీళ్ల నొప్పులు తగ్గించడంలో ఆకుకూరలు ఎంతో ప్రభావితంగా పనిచేస్తాయి. తోటకూర, పాలకూర, మరియు బచ్చలి కూర వంటి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడేట్లు మరియు విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం ద్వారా కీళ్ల నొప్పులు త్వరగా తగ్గతాయి. అలాగే అల్లం కూడా కీళ్ల నొప్పులకు ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కలిగిన అల్లంలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. ఇది కండరాల నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. వర్షాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉత్తేజం కూడా కలుగుతుంది ఇక కీళ్ల నొప్పులను తగ్గించే దివ్య ఔషధంగా వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కీళ్లల్లో రక్త ప్రవాహాన్ని చక్కబెడతాయి. కండరాలు పట్టెయ్యకుండా చూస్తాయి. కీళ్లనొప్పులు తగ్గించడంలో డ్రై ఫ్రూట్స్ కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి, ఇవి కీళ్ల నొప్పులను తగ్గించే గుణం కలిగి ఉంటాయి.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు, ప్రతిరోజు తృణ ధాన్యాలు తమ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలు, ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. కండరాల పనితీరుకు ప్రోటీన్లు ఎంతో అవసరం. ఇవి కొత్త కండరాలు నిర్మాణంలో కూడా ఎంతో సహాయపడతాయి, అంతేకాకుండా కీళ్లనొప్పులు తగ్గేలా కూడా చేస్తాయి. చేపల్లో కీళ్ల నొప్పులను తగ్గించే లక్షణాలు సంవృద్ధిగా ఉంటాయి. సాల్మన్ సార్డినెస్, మాకేరెల్, ట్యూనా చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
Share your comments