ఇప్పుడు ఉన్న ఎండలకు 24 గంటలు AC వాడాల్సిన పరిస్థితి, అలా అని AC ఆన్ లోనే ఉంచితే కర్రెంట్ బిల్లు పేలిపోతుంది. AC ఉపయోగించేవారు ఈ టిప్స్ ని పాటిస్తే, ఎక్కువ కర్రెంట్ ఖర్చు అవ్వకుండా, చల్లగా ఉండొచ్చు . అవేంటో చూద్దాం
1. ఏసీని ఎప్పుడు 24 లో ఉంచండి: మనం ఎక్కువ చల్లగా ఉండాలని చెప్పి ఏసీ ని 16 లేదా 18 లో పేటెస్తూ ఉంటాం ఆలా పెట్టడం వళ్ళ కరెంటు చాల ఎక్కువగా ఖర్చు అవుతుంది. 24 ఉష్ణోగ్రత లో పెట్టి ఏసీ వాడడం వళ్ళ జేబులకె కాకా మన శరీరానికి కూడా మంచిది. ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడం ద్వారా, 6 శాతం విద్యుత్ ను ఆదా చేయవచ్చట!
2. ఏసీ ఉన్న గదిలో పెద్ద ఎలక్ట్రిక్ వస్తువులు ఉండొద్దు: ఏసీ ఆన్ చేసినప్పటినుండి, గది మొత్తం చల్లగా మారేంతవరకు ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది . అయితే , గది లో టీవీ , ఫ్రిడ్జ్ వంటి వేడి విడుదల చేసే గాడ్జెట్స్ ఉంటె, గది చల్లబడడం ఇంకా ఎక్కువ సమయం తీస్కుంటుంది. దాని ద్వారా కర్రెంట్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
3. ఏసీ తో పాటు ఫ్యాన్ ను వాడాలి: ఏసీ ని ఉపయోగిస్తున్నప్పుడు ఫ్యాన్ ను కూడా వాడాలి. ఫ్యాన్ వాడడం వళ్ళ గది లో గాలి అన్ని మూలలకు తేలికగా చేరుకుంటుంది, ఇది గది చాల త్వరగా చల్లబడడానికి తోడ్పడుతుంది. అప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత లో పెట్టిన ఏసీ త్వరగా పనిచేస్తుంది.
4.తలుపులు కిటికీలు మూసేయాలి: ఏసీ ఆన్ చేసే ముందే ప్రతి కిటికీలను, తలుపులను ఖచ్చితంగా మూసేయాలి. లేకపోతే బయట వేడి గాలి లోపలికి , చల్ల గాలి బయటకు చేరిపోడం జరిగి , చల్లబడే ప్రక్రియ ఆలస్యమయ్యి ఎక్కువ కర్రెంట్ ఖర్చు అవుతుంది. తలుపులు లేని పరిస్థితులలో , ప్లాస్టిక్ షీట్లను వాడొచ్చు.
5. స్లీప్ మోడ్ ని ఉపయోగించండి : మనం రాత్రిళ్లు ఒకోసారి ఏసీ ఫుల్ ఆన్ లో పెట్టి నిద్రపోతుంటాం. అప్పుడు రాత్రంతా ఏసీ నడిచి చాల కరెంటు ఖర్చయిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు అన్ని ఏసీల్లో స్లీప్ మోడ్ ఫీచర్ ఉంటుంది. దీని ఉపయోగించడం వళ్ళ రాత్రిళ్ళు ఏసీ వాడకం ఆగిపోయి ఎక్కువ కర్రెంట్ కాలదు.
Share your comments