ఆధునిక జీవితంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. లేచిన దగ్గర నుంచి ఉరుకులు, పరుగులు.. ఆఫీసులో టెన్షన్లతో చాలామందికి కంటినిండా నిద్రపట్టడం లేదు. నిద్రపోదామని ఎంత ట్రై చేసినా నిద్రరాదు. దీంతో కింద,పైనా కొట్టుకుంటూ ఉంటారు. నిద్రలేమి సమస్య వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. చురుగ్గా పనిచేయలేం. మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది.
అయితే టెన్షన్లు అన్నీ వదిలేసి, మనస్సుసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అలాగే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
-నిద్రపోయేటప్పుడు పక్కన ఫోన్ పెట్టుకోకూడదు. అలాగే రాత్రుళ్లు ఫోన్ వాడకూడదు.
-రోజూ ఒకే సమయానికి లేచే అలవాటు చేసుకోవాలి.
-ఇక ఇంట్లో లైట్లు అన్నీ ఆపేయండి. వెలుతురు ఉండటం వల్ల నిద్ర రాదు. చీకటిగా ఉంటే నిద్రపోవాలనే విషయాన్ని మెదడు అర్థం చేసుకోండి. అవసరం అనుకుంటే బాత్‌రూమ్ లైట్‌ను మాత్రమే ఉంచుకోండి
-బెడ్ రూమ్ వాతావరణం చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే నిద్రపోవాలనే ఆలోచన వస్తుంది. బెడ్రూమ్ లో బెడ్ షీట్స్, తలకింద పెట్టుకునే దిండు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇక బెడ్రూమ్ లో టీవీ, ఆఫీసు వర్క్ కి సంబంధించిన ఎలాంటివి ఉంచుకోకూడదు.
-నిద్రపోయే రెండు గంటల ముందే తినాలి. అప్పుడే నిద్రపోయే సమయానికి పొట్టలో తేలికగా ఉండి హాయిగా నిద్రపడుతుంది.
-ఇక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మధ్యాహ్నం తర్వాత కెఫీన్ ఉండే పదార్థాలు, డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. కాఫీ, టీ, చాక్ లెట్స్, డింక్స్ కు దూరంగా ఉండాలి. ఇక ఆల్కహల్ కి సాధ్యమైనంత దూరం ఉండాలి.
-పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు మంచి పుస్తకం చదవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి హాయిగా నిద్రపడుతుంది.
Share your comments