సాధారణంగా మనం రోజువారి వంటకాలలో భాగంగా ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో టమోటా ముందు వరుసలో ఉంటుంది. టమాటాను తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఇది వరకు మనం తెలుసుకున్నాం. కానీ టమోటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనేక సమస్యలను కూడా వెంటబెట్టుకు వస్తుంది. మరి టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం...
టమోటాలలో అధిక భాగం మాలిక్ యాసిక్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మన కడుపులో పేరుకుపోయి తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. దీని కారణంగా కొందరికి చర్మం పై దురద, దద్దుర్లు రావడం జరుగుతుంది. టమోటాలలో అధికంగా కాల్షీయంఆక్సోలేట్ ఉండటం వల్ల ఇది కిడ్నీలో పలు సమస్యలకు కారణమవుతోంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కాల్షీయంఆక్సోలేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
టమోటాలు సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియాకు వాహకంగా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే ఇలాంటి టమోటాలను మనం తీసుకున్నప్పుడు ఎక్కువగా డయేరియాతో బాధపడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. మరికొందరిలో టమోటాలను అధికంగా తీసుకోవడం వల్ల కీళ్లనొప్పుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని టమోటాలు విరివిగా వాడటం వల్ల ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక వీలైనంత వరకు టమోటాలను పరిమితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Share your comments