కరోనా తొలి వేవ్ పోయి సెకండ్ వేమ్ వచ్చింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే ఇది మరింత ప్రమాదకరంగా ఉంది. వేరియంట్లు మార్చుకుంటూ ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తోంది. సెకండ్ వేవ్ వేరియంట్ చాలా డేంజర్ అని, యువకులు, చిన్నపిల్లలపై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీని మరింత పెంచుకోవాలని, పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
లక్షణాలు బయట పడగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. దేశంలో సెకండ్ వేవ్ పంజా విసురుతుండటంతో.. పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ విధించాయి. దీంతో దేశం మరోసారి లాక్ డౌన్ వలయంలోకి వెళ్లిపోయింది. పలు రాష్ట్రాలు రాత్రి కర్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నాయి. మరోవైపు ఆక్సిజన్ కొరత, రెమిడిసివిర్ కొరత, వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది.
అయితే తొలి వేవ్ కంటే సెకండ్ వేవ్ లక్షణాలు విభిన్నంగా ఉన్నాయి. సెకండ్ వేవ్ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, జ్వరం వస్తూ పోతుండటం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన తెలియకపోవడం, నీరసం, అలసట, మోషన్స్ వంటివి సెకండ్ వేవ్ లక్షణాలు. ఇవి కనిపించగానే జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇక వినకబడకపోవడం కూడా సెకండ్ వేవ్ లక్షణమట
కొంతమంది అసలు వినబడటం లేదని, మరికొంతమందికి కొద్ది కొద్దిగా వినబడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక కళ్లు ఎర్రబడం, వాపు ఉండటం, కళ్లు దురద పెట్టడం, కళ్లల్లో నుంచి నీరు రావడం లాంటి లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక నోరు త్వరగా ఆరిపోవడం కూడా కరోనా లక్షణమని డాక్టర్లు చెబుతున్నారు. ఇక గోతు కూడా ఆరిపోయిట్లు ఉంటుందని చెబుతున్నారు.
ఇక కరోనా సోకినా వారిలో డయేరికా సమస్య కూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక విపరీతమైన తలనొప్పి ఉంటుందని, చర్మ సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. చేతులు, కాళ్ల మీద రెషెస్ రావడం కూడా కరోనా లక్షణాల్లో ఒకటని చెబుతున్నారు.
Share your comments