ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహారంతో పాటు మన పరిసరాలు కూడా ఎంతో శుభ్రంగా ఉండాలి.ముఖ్యంగా మనం బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కడపడితే అక్కడ భోజనం చేయడం నీళ్లు తాగడం వంటివి చేసినప్పుడు మనకు తెలియకుండానే మన శరీరంలోకి హానికర బ్యాక్టీరియా, వైరస్లు ప్రవేశించి ప్రమాదకర డయేరియా కారణం కావచ్చు.
ముఖ్యంగా కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు పట్టుకోవచ్చు. కొన్నిసార్లు జ్వరమూ రావొచ్చు. అందుకే బయటి ఆహారం ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ బయట భోజనం చేయాల్సి వస్తే వంట వండే చోట్లు, వండే విధానం, వంట పాత్రలు, వంటకు ఉపయోగించే నీరు అన్నీ శుభ్రంగా ఉన్నచోటే భోజనం చేయాలి. అలాగే బయట కుళాయి నీళ్లు తాగకపోవటం మంచిది.
సాధ్యమైనంతవరకు అప్పుడే వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలి అది మన ఇంట్లో అయినా సరే. కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు ,విరేచనాలు ఎక్కువగా వేధిస్తుంటే ఓ.ఆర్.ఎస్ (ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్) ద్రావణాన్ని తాగడం మంచిది. ఇది అందుబాటులో లేనప్పుడు మంచి నీటిలో చిటికెడు ఉప్పు, తగినంత పంచదార కలిపి తాగొచ్చు లేదా మజ్జిగలో ఉప్పు కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బయటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండటమే మంచిది.
Share your comments