వర్షాకాలం మొదలవగానే చాలామంది వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతారు. అయితే వర్షాకాలం మొదలవ్వగానే వాతావరణంలో కూడా ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే జ్వరం, దగ్గు, జలుబు, వంటి అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మిగతా కాలాలతో పోలిస్తే వేసవికాలంలో ఈ విధమైనటువంటి అంటువ్యాధుల నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం.మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా వర్షాకాలంలో వివిధ రకాల జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మరి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం..
వర్షాకాలం మొదలవగానే చాలామంది బజ్జీలు పకోడీలు వంటి ఆహార పదార్ధాలను తినడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ విధంగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ విధంగా ఇన్ఫెక్షన్ సోకిన ఆకుకూరలను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
శుభవార్త :వంటనూనె లీటర్ కు 15 రూపాయలు తగ్గించాలని ఆదేశించిన కేంద్రం
వర్షాకాలంలో సలాడ్లు తీసుకోవడం మానేయాలి. అలాగే చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారపదార్థాలను తీసుకోవడం మానేయాలి. వర్షాకాలంలో ఎక్కువగా నీరు కలుషితం కావడం వల్ల చేపలు రొయ్యలను తీసుకోవడంతో ఆ ప్రభావం మనపై చూపుతుంది. కనుక ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే మన ఇంటి ఆవరణ చుట్టూ ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి ఆవరణ చుట్టూ ఎక్కడ నీరు నిలవకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా ఆపవచ్చు.
Share your comments