మనిషి ఆరోగ్యం బాగుండాలి అంటే అన్ని రకాల ఆహారాలను తినాలి. భోజనంతో పాటు పండ్లు తినడం కూడా అంతే ముఖ్యం. మన శరీరానికి అనేక పోషకాలు అయిన విటమిన్లు, మినరల్స్ కావలసి ఉంటుంది. ఇటువంటి ఫైబర్, మినరల్స్, విటమిన్లు మనకు పండ్లలో పుష్కలంగా దొరుకుతాయి. ఈ పండ్లలో కివీతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కివీ పండును తినడం వలన మనం అనేక వ్యాధుల నుండి బయట పడవచ్చు.
ఈ కివీ పండును మన ఆహరం లేదా డైట్లో భాగం చేసుకోవడం వలన వివిధ రకాల సమస్యలను దూరం చేయచ్చు దానితో పాటు మన చర్మ రక్షణకు , రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ కివీ పండు సహాయపడుతుంది. ఈ కివీ పండు తినడం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
రక్తపోటు నియంత్రణ: ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ప్రజలు ఈ రక్తపోతూ సమస్యతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు వలన గుణేపోతూ వచ్చే సమస్య కూడా ఉంది. ఈ సమస్య ఉన్నవారు ఈ కివీ పండు తింటే చాలా మంచిది. ఈ కివి పండులో పొటాషియం శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేకాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి..
పరిగడుపున తేనె నీళ్లు తాగడంతో ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా? కానీ వీళ్లు తాగకూడదు..
దృడఫేమైన ఎముకలు: కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్ ఉంటుంది. ఈ ఫోలేట్ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది. ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్ కే కూడా బాగా ఉపకరిస్తుంది. అందుకే గర్భిణిల డైట్లో కివీ పండును చేర్చడం చాలా ముఖ్యం.
జీర్ణశక్తీ: ఈ కివీ పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. కివి పండును తినడం వలన 100 గ్రాములకు 3 గ్రాముల ఫైబర్ మనకు లభిస్తుంది. ఈ ఫైబర్ అనేది మన జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి మన డైట్లో భాగంగా ఈ కివీ పండ్లను తినడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రోగనిరోధక శక్తీ: మనిషి శరీరంలో రోగనిరోధక శక్తీ పెంచడానికి విటమిన్ సి అనేది బాగా ఉపయోగ[పడుతుంది. అలాంటి ఈ విటమిన్ సి ఈ కివి పండులో ఎక్కువగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్వల్ల శరీరానికి నష్టం జరగకుండా కాపాడుతాయి.
ఇది కూడా చదవండి..
Share your comments