భారతీయ వంటకాలు ఎన్నో సుగంధద్రవ్యాలకు, మాసాలకు మూలం. ఇక్కడి వంటకాల్లో వాడే ప్రతిదీ ఏదోవిధంగా ఆరోగ్యం చేకూర్చేదే . మెంతులు వంట దీనిసుల్లో ఒకటి. మెంతాల్లోని విభిన్నమైన రుచి వంటకాలకు ప్రత్యేక రుచిని అందిస్తుంది. సంవత్సరం అంత నిల్వవుండే పచ్చళ్లలో మెంతులు ఒక భాగం. మెంతులను ఎన్నో రకాల కూరల్లో, సాసుల తయారీలో వినియోగిస్తారు. ఆహారంతో పాటు మెంతులను ఆయుర్వేదంలో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తారు. ప్రస్తుతం డైటింగ్ చేసేవారు కూడా మెంతుల్లోని ఆరోగ్య ప్రయోజనాలు గుర్తించి వీటిని తమ ఆహారంలో చేర్చుకోవడం మొదలుపెట్టారు. వీటివల్ల ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుతుంది:
ప్రస్తుతం ప్రపంచంలో ఎంతో మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒకప్పుడు షుగర్ వ్యాధి వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించేది కానీ ప్రస్తుతం ఆహార విధానాలు మారడం, మరియు జన్యులోపాల వలన చిన్న పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి కనిపిస్తుంది. చాల మంది వారి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేక ఎంతో ఇబ్బంది పడతారు. అటువంటి వారికి మెంతులు ఒక దివ్యౌషధం వంటిది అని చెప్పవచ్చు. మెంతుల్లో ఉండే కొన్ని సమ్మేళనాలు, రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా ప్రేరేపిస్తాయి, తద్వారా షుగర్ నియంత్రణలో ఉంటుంది. టైపు 2 డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు చక్కగా పనిచేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అసిడిటీని నియంత్రిస్తుంది:
రానురాను ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని కాకుండా బయట దొరికే ఆహారాన్ని ఎక్కువుగా తినడం వలన అసిడిటీ సమస్యలు పెరుగుతూవస్తున్నాయి. అసిడిటీ సమస్య ఉన్నవారు మెంతులు తినడం చాల మంచిది. మెంతులు జీర్ణక్రియను మెరుగుపరిచి, అసిడిటీ వంటి సమస్యలను దూరంగా ఉంచుతాయి. మలబద్దకం ఉన్నవారు మెంతులను తినడం ద్వారా ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఒక స్పూన్ మెంతులను రాత్రి పడుకునేముందు నానబెట్టి, ఉదయం నిద్రలేవగానే తింటే మంచి ఫలితం లభిస్తుంది.
తల్లి పాలు పెంచగలవు:
అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలుకు మించిన ఔషధం లేదంటారు. కానీ కొంతమంది తల్లులకు పాల ఉత్పత్తి జరగదు. మెంతుల్లో తల్లిపాల ఉత్పత్తిని పెంచగలిగే గుణం ఉంది. బాలింతలు మెంతి నీరు తాగితే పాలఉత్పత్తి పెరిగినట్లు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిపాలు తాగి పెరిగిన పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారు.
కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది:
శరీరానికి కొద్దీపాటి కొవ్వు పదర్ధాలు అవసరం, ఈ కొవ్వు పదార్ధాలు మనం తినే ఆహారం నుండి మనకి లభిస్తాయి. కానీ కొవ్వు పదర్ధాలు ఎక్కువగా ఉండే ఆహారం తింటే, అవి జీర్ణంకాక కొలెస్ట్రాల్ లాగా మారుతుంది. ఈ కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో చేరి గుండెపనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది. మెంతుల్లో ఉండే సోపోనిన్స్ చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి, మంచి కొవ్వును పెంచేందుకు తోడ్పడతాయి.
నెలసరి నొప్పిని తగ్గించగలవు:
నెలసరి సమయంలో స్ట్రీలకు వచ్చే నొప్పి మరియు తిమ్మిర్ల నుండి మెంతులు కాపాడగలవు. వీటిలోని కంపండ్లకు నొప్పిని నివారించే గుణం ఉంటుంది. నెలసరి సమయంలో నొప్పిగా ఉన్నవారు, నీటిలో మెంతుపొడిని కలిపి తాగడం వలన నొప్పినుండి ఉపశమనం లభిస్తుంది.
Share your comments