ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని దంత సమస్యలు వేధిస్తున్నాయి.
దంత సమస్యకు ప్రధాన కారణం నోటి శుభ్రత పాటించకపోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, ధూమపానం, మద్యపానం అలవాటు ఉండటం వంటి కారణాల వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్ ప్రారంభమై దంతాలకు రక్షణ కవచంలా ఉండే ఎనామిల్ పొర దెబ్బతిని దంతక్షయం ఏర్పడుతుంది.దీంతో దంతాలు విరగడం, వదులుగా మారడం చిగుళ్ళవాపు కారణంగాతరుచు పంటినొప్పితో బాధపడాల్సి వస్తుంది. మనకు అందుబాటులో ఉన్న కొన్ని వనరులను ఉపయోగించి పంటినొప్పిని తరిమేయవచ్చు అది ఏలాగో ఇప్పుడు చూద్దాం.
దంత సమస్యలను పరిష్కరించడంలో జామ ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి.జామ ఆకులలో యాంటీ ఇన్ప్లోమెంట్రీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రోపర్టీస్ పుష్కలంగా ఉండటం వల్ల జామ ఆకుకషాయాన్ని నోట్లో వేసుకొని పుక్కిలిస్తే నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. లేదా జామాకులను మెత్తగా నూరి నొప్పి ఉన్న పంటిపై రాస్తే కొద్ది క్షణాల్లో నొప్పి తగ్గడమే కాకుండా చిగుళ్ల సమస్యలను ,నోటి దుర్వాసనను కూడా తొలగిస్తాయి. అల్లంను చిన్న ముక్కలుగా చేసి నొప్పి ఉన్న చోట అప్లై చేస్తే కొద్దిసేపట్లోనే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.
మన వంటింట్లో దొరికే లవంగాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మెండుగా ఉండడంవల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ ను నశింపజేసి దంతాలను చిగుళ్లను ఆరోగ్యంగా ఉండునట్లు చేస్తుంది.లవంగాలను నొప్పి ఉన్న భాగంలో 30 నిమిషాలు అదిమి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.రాళ్ల ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కరిగించి 30 సెకన్ల పాటు నోటిలోనే ఉంచి పుక్కిలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మంచి కలబందలో ఉండే సహజ సిద్దమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా కలబంద గుజ్జును పంటిపై మర్దన చేస్తే అనేక రకాల సూక్ష్మజీవులను నశింపజేసి దంత క్షయాన్ని నివారిస్తుంది. అలాగే వెల్లుల్లి, ఉప్పును మిశ్రమంగా చేసి నొప్పి ఉన్న పంటిపై కొద్దిసేపు ఉంచితే కొన్ని నిమిషాల్లో నొప్పి తీవ్రత తగ్గిస్తుంది. దంతాల సమస్యలు మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ను సంప్రదించడమే ఉత్తమైన మార్గం.
Share your comments