Health & Lifestyle

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీటిని అవాయిడ్ చెయ్యండి

KJ Staff
KJ Staff

వేసవి కాలం కావడంతో, పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. పిల్లలతో కాస్త టైం గడపడానికి ఇది మంచి సమయం కాబట్టి, తల్లితండ్రులు పిల్లల్ను తీసుకుని సాయంకాలం సమయంలో బయట తిరగడానికి వెళ్తారు. సాయంత్రం సమయంలో స్ట్రీట్ ఫుడ్ ఎక్కువుగా ఉంటాయి, చాల మంది తల్లితండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ స్ట్రీట్ ఫుడ్స్ తినడానికి మక్కువ చూపుతారు. అయితే మీరు తినే ఆహారం మంచిదా? కదా? అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది.

స్ట్రీట్ ఫుడ్స్ కళ్ళకు ఇంపుగా చూడగానే తినాలనిపించేలా ఉంటాయి, పైగా వాటి ధర కూడా అందుబాటులో ఉండటం కారణంగా జనం వీటికి ఎక్కువుగా ఆకర్షితులు అవుతారు. ఐతే వీధుల్లోని ఆహారంలో వాడే పదార్ధాలు ఆరోగ్యానికి మంచివి కావు, అందులోనూ వేసవి కాలంలో వీటిని ఏక్కువుగా తింటే అస్వస్థతకు లోనయ్యే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. వేసవి కాలంలో జీర్ణ శక్తి మందగిస్తుంది. అధిక కెలోరీలు, కొవ్వు పదార్ధాలు ఉన్న ఆహారాన్ని తినడం మూలాన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చాల వీధి ఆహార వర్తకులు అపరిశుభ్రమైన ఆహారాన్ని వికృయితు ఉండటం తరచు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, అయినా సరే ప్రజలు ఇటువంటి ఆహారానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కలుషిత ఆహారాన్ని తిందాం ద్వారా టైఫాయిడ్, విరోచనాలు, మరియు ఇతర పొట్ట సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వేసవి కాలంలో కొన్ని రకాల ఆహారపదార్ధాలు దూరంగా ఉండటం మంచింది వాటి గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

కట్ చేసిన పళ్ళు మరియు కూరగాయలు:

పళ్ళు మరియు కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలిసిన విషయమే, అందులోనూ వేసవి కాలంలో పళ్ళు మరియు కూరగాయలు వీలైనన్ని ఎక్కువ సార్లు తినమని వైద్యులు సూచిస్తారు. అయితే చాల పట్టణాల్లో, రోడ్ పక్కన కట్ చేసి ఉంచిన పళ్ళు కూరగాయ ముక్కలు, సలాడ్స్ లాగా అమ్ముతూ కనిపిస్తారు, ఇటివంటి కట్ చేసిన పళ్ళు, కూరగాయ ముక్కలు, సాధ్యమైనంత తక్కువ తినడం మంచిది. ఎందుకంటే, కట్ చేసిన ఆహారం పదార్ధాల మీద బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. వేసవి కాలంలో బాక్టీరియా మరింత వేగంగా పెరుగుతుంది కనుక, కట్ చేసిన పళ్ళ ముక్కలను అవాయిడ్ చెయ్యండి.

పాల ఉత్పత్తులు:

పాల ఉత్పత్తులు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఐస్ క్రీం, వేసవి కాలంలో ఐతే ఐస్ క్రీం సేల్స్ విపరీతంగా ఉంటాయి. దాదాపు అన్ని వయసుల వారికి ఐస్ క్రీం అంటే మక్కువ ఎక్కువ. ఐతే పాల ఉత్పత్తులు అన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలో స్టోర్ చేయవలసి ఉంటుంది, లేదంటే హానికారక బాక్టీరియా వృద్ధి చెందుతుంది. సాధారణంగా, ఐస్ క్రీం బళ్ళలో నిర్దిష్ట పరిమాణానికి తగ్గ ఉష్ణోగ్రత నిర్వహించడం అసాధ్యం, బళ్లలోని ఐస్ క్రీం బాక్టీరియా కు నివాస స్థానంగా మారతాయి. వీటిని తినడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

మాంసాహారం:

మాంసాహార ప్రియులకు, స్ట్రీట్ ఫుడ్ ఒక స్వర్గం వంటింది. ఈ రోజుల్లో సమోసా దగ్గర నుండి బిర్యానీ వరకు ప్రతి స్ట్రీట్ ఫుడ్ లో మాంశం ఒక భాగం చేస్తున్నారు. ప్రజలు కూడా నాన్ వెజ్ మీద ఇష్టంతో అటువంటి ఆహారాన్ని ఎక్కువుగా స్వీకరిస్తున్నారు. అయితే అధిక శాతం మాంసాహార పదార్ధాలను సర్రిగ్గా ఉడికించారు, వాటిని తిన్నవారు సాల్మొనెల్లా, ఈ -కొలై వంటి హానికారక బాక్టీరియా భారిన పడే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఇంకా ఈ వేసవి కాలంలో బయట దొరికే సిఫుడ్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. మాంసాహారలో కెలోరీలు ఎక్కువుగా ఉంటాయి, అలాగే వాటిని వండటానికి ఉపయోగించే నూనె కూడా శుభ్రమైనది వాడరు, ఇటువంటి ఆహారం జీర్ణం కావడానికి చాల సమయం పడుతుంది.

Share your comments

Subscribe Magazine