Health & Lifestyle

పండ్లు మరియు కూరగాయలపై పురుగుమందులను గుర్తించగల సెన్సార్!

S Vinay
S Vinay

కోవిడ్ అనంతర కాలంలో ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. కూరగాయలు మరియు పండ్లను తినడానికి ముందు వాటిని పూర్తిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

పురుగుమందుల వాడకం పెరగడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది మరియు ఆహార ఉత్పత్తులలో పురుగుమందుల అవశేషాలు అధికంగా పేరుకుపోతాయి, ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరిపింది, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను నివారించడానికి ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు రసాయన రహిత ఆహారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.ఇప్పుడు నూతన సాంకేతిక ఆవిష్కరణ ద్వారా ఆహార భద్రత సమస్యలకు పరిష్కారం దొరికింది. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పండ్లు మరియు కూర గాయాలపై ఉండే పురుగుమందులను గుర్తించే చిన్నసెన్సార్‌ను అభివృద్ధి చేసింది.

పరిశోధనలు అకడమిక్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి 'అడ్వాన్స్‌డ్ సైన్స్.' నానో-సెన్సర్‌లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, ఆహారపు పురుగుమందులను వినియోగించే ముందు గుర్తించడంలో అవి సహాయపడవచ్చు. మానవ ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులు మరియు హానికరమైన రసాయనాలను, స్థానిక దుకాణాలు మరియు సూపర్ మార్కెట్‌లలో లభించే ఆహార ఉత్పత్తులపై గుర్తించడమే ఈ ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


ఈ నానో-సెన్సర్‌లు 1970ల నాటి సర్ఫేస్-ఎన్‌హాన్స్‌డ్ రామన్ స్కాటరింగ్ (SERS) అని పిలువబడే ఆవిష్కరణ ఆధారంగా పనిచేస్తాయి. ఇది హానికర రసాయనాలను మరియు పురుగుమందులను త్వరగా మరియు సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది.ఐరోపా లో విక్రయించే అన్ని పండ్లలో సగం వరకు పురుగుమందులు ఉన్నాయని నివేదికలు చూపిస్తున్నాయి, అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ యొక్క మైక్రోబయాలజీ, ట్యూమర్ మరియు సెల్ బయాలజీ విభాగంలో ప్రధాన పరిశోధకుడు జార్జియోస్ సోటిరియో వెల్లడించారు.భారత్ లో కూడా ఈ సమస్య అధికంగానే ఉంది.

మరిన్ని చదవండి.

MotoCorp Electric Bike:ఎలక్ట్రిక్ బైక్..ప్రభుత్వం నుంచి రూ. 40 వేల సబ్సిడీ!

Share your comments

Subscribe Magazine