Health & Lifestyle

సబ్జా గింజలు తో మలబద్ధానికి చెక్.. !

Srikanth B
Srikanth B
Sabja seeds health benefits in winter  and summer
Sabja seeds health benefits in winter and summer

సబ్జా గింజలు వీటి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలన్నింటిలోనూ భలే వింతగా ప్రవర్తించేవి ఇవే కాబట్టి..! చాలామందికి ఇవి బాగా గుర్తుండిపోయి ఉంటాయి. నీటిలో వేయగానే ఉబ్బి, జెల్‌లా తయారవుతాయి సబ్జ గింజలు. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట.. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది.. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో ఒకసారి చూద్దాం..!

సబ్జా గింజలు.. చలవే కాదు ఎంతో ఆరోగ్యం


వేసవి కాలం వచ్చేసింది. బయటికెళ్లి వస్తే చాలు మాడు మాడిపోతుంది. ఒంట్లో వేడి పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక మనం బోలెడన్ని పానీయాలు తాగేస్తుంటాం.
సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్లు, షరబత్లు ఇలా రోడ్డు మీద కనబడే ప్రతీది తాగాలనిపిస్తుంది. కానీ వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇంటి దగ్గరే మనకు మంచి పానీయం ఉంది. అదే సబ్జా గింజల పానీయం. ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది దాన్ని మరిపోయారు. కానీ ఈ వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు.

ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల పానీయం ఎలా చేయాలి, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
పానీయం తయారీ

గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని వాటిలో చిన్న చిన్న రాళ్లు, బెడ్లు ఉంటే ఏరేయాలి. మంచి నీళ్లతో వాటిని శుభ్రంచేసి ఓ కప్పులో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు కాస్త జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగొచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకుని తీసుకోవచ్చు.

ఇక్కడ చీమలు తేనెను తయారు చేస్తాయి ...

మలబద్ధానికి చెక్

సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
బరువు తగ్గడానికి మంచి చిట్కా

ఊబకాయంతో బాధపడే చాలా మందికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుంది. ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు కూడా చాలా తక్కువే.
మధుమేహం నుంచి ఉపశమనం
చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.

ఇక్కడ చీమలు తేనెను తయారు చేస్తాయి ...

Share your comments

Subscribe Magazine