Health & Lifestyle

మీరు ఆహారం తొందరగా తింటున్నారా అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే

KJ Staff
KJ Staff


ప్రస్తుతం ఉరుకులు పరుగులు కూడిన జీవితంలో, ప్రశాంతంగా కూర్చుని ఆహరం తినే అవకాశం కొద్దీ మంది దగ్గర మాత్రమే ఉంది. పని లోని స్ట్రెస్ వలన చాల మంది మంచి ఆహారం తీసుకోవడం మానేశారు. ఇంకొంత మంది ఆహారం నమలకుండానే మింగేస్తున్నారు. ఇది చాల ప్రమాదకరం.

ఆహారం మన ప్రాణాన్ని నిలబెట్టి, నడిపించే ఒక ఇంధనం వంటిది. మన పెద్దవారు మరియు వైద్యులు సూచించిన విధంగా ఆహరం నెమ్మదిగా తినడం చాల కీలకం. ఆహారాన్ని నమలకుండా తొందరగా తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి, వాటిగురించి ఇప్పుడు తెల్సుకుందాం.

ఆహారాన్ని తొందరగా తినడం ద్వారా జీర్ణవ్యవస్థ దెబ్బతిని గ్యాస్, మరియు అసిడిటీ వచ్చే సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆహరం జీర్ణం కావడం నోటినుండి మొద;అవుతుంది. ఆహరం నములుతున్న సమయంలో విడుదలయ్యే లాలాజలం ఆహారంతో కలిసి, కొన్ని రకాల ప్రోటీన్లను జీర్ణం కావడంలో ఉపయోగపడుతుంది. ఆహారం తొందరగా తినేవాళ్లలో అజీర్తి, వికారం వంటి సమస్యలు తలైతే అవకాశం ఎక్కువ.

మన పెద్దలు నిధానమే ప్రధానం అన్నారు, ఆహారం తినే సమయంలో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. నెమ్మదిగా ఆహారం తినడం ద్వారా జీర్ణాశయం పనిచెయ్యడానికి తగినంత సమయం లభిస్తుంది. తీసుకున్న ఆహారం బాగా నమిలి, మింగడం ద్వారా పొట్టకు శ్రమ తగ్గి ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాకుండా ఆహరం యొక్క అసలైన రుచి నెమ్మదిగా తిన్నపుడు మాత్రమే తెలుస్తుంది.

Share your comments

Subscribe Magazine