ఒక స్త్రీ గర్భం దాల్చితే 5వ నెల నుంచి పాలలో కుంకుమపువ్వు కలిపి తాగటం వల్ల వారికి పుట్టబోయే బిడ్డ ఎంతో అందంగా, తెల్లగా పుడతారనీ భావిస్తారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క స్త్రీ గర్భం దాల్చిన 5వ నెల నుంచి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగుతారు. నిజంగానే పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తాగడం వల్ల పిల్లలు తెల్లగా పుడతారా... దీనిలో నిజమెంతో ఉంది. నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
గర్భం దాల్చిన మహిళలు వారి పిల్లలు తెల్లగా పుట్టాలంటే కుంకుమపువ్వు పాలలో కలుపుకొని తాగినంత మాత్రాన పిల్లలు తెల్లగా పుట్టరని నిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లలు తెల్లగా లేదా నల్లగా పుట్టడం అనేది వారి తల్లిదండ్రులను బట్టి రంగు కూడా వారసత్వంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఒకరు తెలుపుగా,మరొకరు నల్లగా ఉన్నారంటే అందుకు గల కారణం సూర్యరశ్మి అని కూడా చెప్పవచ్చు.
సాధారణంగా మనం నల్లగా ఉన్నామంటే అందుకు కారణం మన శరీరంలో "మెలనిన్" అనే ఒక పిగ్మెంట్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మనం నల్లగా ఉంటాము. ఎవరిలో అయితే మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉంటుందో అలాంటి వారు తెలుపు రంగులో పుడతారు. సూర్యుడు నుంచి విడుదలయ్యే కిరణాలు మన శరీర భాగాలపై పడినప్పుడు ఆ శరీర భాగాలలో ఎక్కువగా మెలనిన్ ఉత్పత్తి కావడం వల్ల మన కాళ్లు చేతులు నలుపు రంగులో ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే భూమధ్యరేఖకు దగ్గరగా నివసిస్తారో అలాంటి దేశస్తులు అధికంగా నలుపు రంగును కలిగి ఉంటారు.అంతే కాని కుంకుమ పువ్వు తాగటం వల్ల పిల్లలు తెల్లగా పుడతారు అనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు తెలియజేశారు.
Share your comments