భారత దేశంలో అంతగా ప్రజాదరణ పొందని క్వినోవా లో అనేక పోషక విలువలు కలవు. అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలలో క్వినోవా ఆరోగ్య ఆహారంగా ప్రజాదరణ పొందింది.వందల సంవత్సరాల క్రితంనుండి వారు క్వినోవని పండిస్తున్నారు కొన్ని ప్రాంతాలలో దీనిని పవిత్రమైన ఆహారంగా భావిస్తారు.
క్వినోవా యొక్క పోషక ప్రయోజనాలు
100గ్రా క్వినోవా లో ఉండే పోషక విలువలు:
120 Kcal/503KJ
4.4 గ్రా ప్రోటీన్
1.9 గ్రా కొవ్వు
19.4 గ్రా కార్బోహైడ్రేట్
2.8 గ్రా ఫైబర్
17mg కాల్షియం
64 mg మెగ్నీషియం
క్వినోవా ఒక అద్భుతమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది, ఇందులో మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.
దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు
క్వినోవాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫైటోన్యూట్రియెంట్లు అధికంగా ఉన్నాయి, ఇది వ్యాధి నివారణ మరియు చికిత్సలో మానవ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది . క్వినోవాలో గుండెకి ఆరోగ్యం చేకూర్చే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి మరియు సాధారణ తృణధాన్యాలతో పోల్చితే, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది.
బరువును తగ్గిస్తుంది.
బార్లీలో కంటే ఎక్కువగా క్వినోవాలో ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు తగ్గాలని చూస్తున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇందులో ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ సమ్మేళనాలు ఆకలిని నియంత్రిస్తాయి. అంతేకాకుండా క్వినోవా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంది కాబట్టి దాని శక్తి నెమ్మదిగా విడుదల చేయడం వలన ఆకలిని వేయడం తక్కువ.
బ్లడ్ షుగర్:
క్వినోవా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరుస్తుందని మరియు రక్తంలో చక్కెర నిర్వహణను మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
జీర్ణ వ్యవస్థని కాపాడుతుంది.
క్వినోవా ఫైబర్ యొక్క గొప్ప మూలం. ఫైబర్ మలబద్ధకాన్ని నిరోధించగలదు మరియు మీ ప్రేగు క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది పేగు వ్యవస్థని శుద్ధి చేయడం లో ఉపయోగపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
క్వినోవాలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇది ఒక ప్రధాన ఆరోగ్య ప్రయోజనం, ఇవి వృధ్యాప్త ఛాయలు రాకుండా అరికడుతాయి. మరియు అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలోసహాయపడుతాయి.
మరిన్ని చదవండి.
Share your comments