మన దేశ వంటకాల్లో కరివేపాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, విశిష్టమైన స్థానం సంపాదించుకుంది. కొన్ని వాటి ప్రత్యేక రుచి రావడానికి కరివేపాకు దోహదపడుతుంది. వంటకాలకు రుచి, సువాసన అందించడంతో పాటు, కొన్ని ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో అతికొద్ది మంది మాత్రమే కూరల్లో లేదా ఏమైనా వంటకాల్లో వేసిన కరివేపాకును తింటారు. నూటికి 90% మంది కరివేపాకు వదిలేసే వారే. కరివేపాకు లోని పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడు దీని పక్కన పెట్టారు. కూరల్లో వేసిన కరివేపాకునే కాకుండా పచ్చివి కూడా ఎటువంటి భయం లేకుండా తినవచ్చు, ఉదయాన్నే కొన్ని ఆకులను తినడం ద్వారా జీర్ణవ్యవస్థ శుభ్రం అవుతుంది. పచ్చివి తినలేము అనుకునేవారు, కరివేపాకు డిటాక్స్ వాటర్ కూడా తాగచ్చు దీని కోసం గ్లాసుడు నీళ్లల్లో కొన్ని కరివేపాకు ఆకులు వేసి మరిగించాలి. ఈ నీటిలో తేనే కలుపుకుని తాగితే జీర్ణాశయంలో ఉన్న చెడు మొత్తం శుభ్రం అవుతుంది. కరివేపాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థ మెరుగుపరిచి, జీర్ణక్రియకు తోడ్పడుతుంది, అందుకే బాలింతలకు, అనారోగ్యంగా ఉన్నవారికి మొదట కరివేపాకు పొడితో అన్నం తినమని చెబుతారు. మలబద్దకం ఉన్నవారు కరివేపాకు ఆకులు తింటే ఈ సమస్య నుండి బయట పడతారు.
కరివేపాకు ఆకులకి రక్తాన్ని శుభ్రపరిచే తత్త్వం ఉంది దీనిలోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. కొంత మందికి జుట్టు రాలిపోవడం మరియు జుట్టు పెరగకపోవడం సమస్యగా మారవచ్చు, అటువంటి వారికి కరివేపాకు చక్కగా పనిచేస్తుంది. కరివేపాకుతో పోషకాలు సంవృద్ధిగా లభించడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కరివేపాకుతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. కరివేపాకు నీటిని లేదా ఆకులను తినడం ద్వారా బరువు క్రమక్రమంగా తగ్గుతుంది. పైగా దీనిలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. ఎల్ డి ఎల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయంచేస్తుంది. ముఖ్యంగా మధుమేహం లక్షణాలు ఉన్నవారికి కరివేపాకును తినడం ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో హైపోగ్లేసెమిక్ లక్షణాలు కలిగి ఉండటం చేత రక్తంలోని స్థాయిని తగ్గిస్తుంది. ఈ విధంగా కరివేపాకులో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇకనుండి మీరు తినే ఆహారంలో కరివేపాకు వస్తే దానిని పక్కన పెట్టకుండా తినడం అలవాటు చేసుకోండి. మంచి చేస్తుంది కదా అని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తింటే అది ప్రమాదకరం.
Share your comments