మన శరీరంలో ఇతర అవయవాలతో పాటు కిడ్నీలు కూడా ఎంతో ముఖ్యమైనవని చెప్పవచ్చు.మూత్ర పిండాలు మన శరీరంలో రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను వడగట్టి రక్తాన్ని శుభ్రపరచడంలో దోహదపడుతుంది. అదేవిధంగా రక్తపోటును నియంత్రించడానికి కూడా కిడ్నీలు దోహదపడతాయి. మరి మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ కిడ్నీల ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది.
ముఖ్యంగా ఎవరైతే అధిక రక్తపోటు,మధుమేహ సమస్యతో బాధపడుతుంటారు అలాంటివారు తప్పనిసరిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో యూరినరీ ఇన్ఫెక్షన్ లకి గురి అయ్యి ఆ ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు పాకి మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.ఈ విధంగా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న వారు యాంటీబయాటిక్ ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొంది కిడ్నీల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
సాధారణంగా మూత్రపిండాలు పనితీరు పూర్తిగా నశించి నప్పుడు మాత్రమే వాటి లక్షణాలు బయటపడతాయి కనుక ముందుగానే కిడ్నీల ఆరోగ్యం పట్ల మనం ఎంతో శ్రద్ధ వహించాలి. అధిక బరువు ధూమపానం ఆల్కహాల్ అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారిలో తప్పనిసరిగా ఈ విధమైనటువంటి కిడ్నీల సమస్యలు తలెత్తుతాయి. ఈవిధంగా కిడ్నీలు ఫెయిల్యూర్ ఆయన వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పనిసరి.
కొందరికి పుట్టుకతోనే మూత్రపిండాలలో కణతులు ఏర్పడుతుంటాయి. అయితే ఇలాంటి కణతులు ఉండటం వల్ల మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి, బరువు తగ్గడం, అజీర్ణం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి అబ్బాయిలలో కంటే అమ్మాయిలలో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు ముందుగా వైద్యుని సంప్రదించి సకాలంలో సరైన పరీక్షలు చేయించుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Share your comments