ప్రస్తుత కాలంలో వివిధ కారణాల వల్ల చాలా మంది అధిక శరీర బరువు పెరుగుతున్నారు.ఈ క్రమంలోనే శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా శరీర బరువు తగ్గడంతో పాటు ఎంతో ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి మఖాన మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.మఖాన ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల ఉపవాసం చేసే వారికి ఇది ఒక మంచి ఆహార పదార్థం అని భావిస్తారు. తరచూ ఈ విధమైనటువంటి ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా అందంగా కూడా ఉండవచ్చు.
మఖాన తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో అధిక మొత్తంలో ప్రొటీన్లు,ఫైబర్ ఉండటం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ క్రమంలోనే తొందరగా ఆకలి అనే భావన కలగకపోవడం శరీర బరువు తగ్గించుకోవచ్చు.
ఈ మఖాన గింజలను తామర గింజలు అని కూడా అంటారు. ఇందులో యాంటీ బయోటిక్స్ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తామర గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Share your comments