Health & Lifestyle

కలవరపెడుతున్న "మద్రాస్ ఐ" వ్యాధి ..రోజు రికార్డు స్థాయిలో కేసులు!

Srikanth B
Srikanth B
కలవరపెడుతున్న "మద్రాస్ ఐ" వ్యాధి ..రోజు రికార్డు స్థాయిలో కేసులు!
కలవరపెడుతున్న "మద్రాస్ ఐ" వ్యాధి ..రోజు రికార్డు స్థాయిలో కేసులు!

వ్యవహారిక భాషలో చెప్పాలంటే ' కళ్ల కలక'గా గ పిలువబడే ఈ వ్యాధి తమిళనాడు వ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది . రాష్ట్రవ్యాప్తంగా ప్రతీరోజూ 4,000 నుంచి 4,500 కేసులు నమోదు అవుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది .

తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఇన్ఫెక్షన్ లు కూడా పెరుగుతున్నాయి దానిలో భాగమే ఈ ' కళ్ల కలక'గా పిలువబడే వ్యాధి తమిళనాడు వ్యాప్తంగా ప్రజలను భయాందోళనను గురి చేస్తుంది .

వాయు కాలుష్యం కళ్లపై ప్రభావం చూపుతుందా ?

రాష్ట్ర వ్యాప్తముగా ప్రతిరోజు కేసులు పెరుగుతుండడంతో వ్యాధి ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వ్యాధి సోకినా వ్యక్తులు అధికముగా బయట తిరగ కూడదని ఆరోగ్య శాఖ సూచించింది . దీనితో వ్యాధిని కొంత మేరకు అరికట్టవచ్చని మద్రాస్ ఐని కళ్లకలక, పింక్ ఐ, రెడ్ ఐ పేరుతో పిలుస్తారు. కళ్లు ఎర్రబడటం, కంటి చుట్టూ నొప్పి, కళ్ల నుంచి నీరు కారడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.అడినో వైరస్ కారణంగా ఈ మద్రాస్ ఐ ఇన్ఫెక్షన్ సోకుతుంది. 1918లో తొలిసారిగా మద్రాస్ లో దీన్ని గుర్తించడం వల్ల మద్రాస్ ఐ అనే పేరు వచ్చింది. ఎక్కువగా వేడి, తేమ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. మద్రాస్ ప్రాంత, ముఖ్యంగా తమిళనాడులో ఈ తరహా వాతావరణం ఎక్కువగా ఉంటుంది.ఇది అంటూ వ్యాధి కావున లక్షణాలు ఉంటే ప్రజలు వేంటనే వైద్యున్ని సంప్రదించాలని డిసెంబర్ మొదటివారం వరకు ఈ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.

వృదులకు సులువుకానున్న తిరుమల దర్శనం !

Related Topics

Madras Eye air pollution

Share your comments

Subscribe Magazine