Health & Lifestyle

చింత గింజల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలోదలరు?

KJ Staff
KJ Staff

సహజంగా చింతకాయలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ చింత గింజల్లో
ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చింతగింజల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కావున చింత గింజలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. కావున ప్రతిరోజు చింత గింజల పొడిని పాలు లేదా నీళ్లలో కలిపి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

చింత గింజల్లో పొటాషియం అధికంగా అధికంగా ఉంటుంది కావున ప్రతిరోజు చింత గింజల పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

చింత గింజల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.

చింత గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థని మెరుగు పరుచుకోవడానికి సహాయ పడటమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది.

చింతగింజల పొడిని ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ కలిపి రోజుకి రెండుసార్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర లెవల్స్ ను తగ్గించే ప్రమాదకర డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.                                                                                                                                                                                                                చింత గింజల పొడిని ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించుకోవచ్చు.



చింత గింజల పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట నాణ్యమైన చింత గింజలను సేకరించి దోరగా వేయించి మెత్తటి పొడితయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న పొడిని
గాజు సీసాలో నిల్వ ఉంచుకోని ప్రతిరోజు
పాలు లేదా నీటిలో అర టీ స్పూన్ చింత గింజల పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.

Share your comments

Subscribe Magazine