మన పూర్వికులు నీరు తాగడానికి ఎక్కువగా రాగి పాత్రలను మాత్రమే వాడేవారు. వారు ఆరోగ్యాంగా ఉండటానికి ఈ రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం కూడా ఒక కారణం. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో రాగి బిందెలను రాగి పాత్రలను వాడుతున్నారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో అందరు నీరు తాగడానికి ప్లాస్టిక్ బాటిళ్లని వాడుతున్నారు. కానీ ఇది మన ఆరోగ్యానికి అంత మంచిదికాదు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీరుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం
శరీర అధిక ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
మనం తీసుకునే ఆహరం మరియు వాతావరణం ద్వారా శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి అధిక స్థాయిని చేరుకుంటుంది. రాగి పాత్రలో నిల్వ చేసిన నీరుని తాగడం వల్ల ఇది శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది.
రక్తహీనతను నివారిస్తుంది:
రాగి హీమోగ్లోబిన్ను తయారు చేయడానికి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది, ఇది శరీరానికి కావాల్సిన ఐరన్ ని గ్రహించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ ని జయిస్తుంది.
రాగి అనేదిఒక యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్‌తో వాటి ప్రతికూల ప్రభావాలతో పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ మరియు వాటి హానికరమైన ప్రభావాలు మానవ శరీరంలో క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. రాగి కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.
రాగి మానవ శరీరం లో మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది, ఇది చర్మం మరియు కళ్ళకు కాంతిని ఇస్తుంది.అలాగే సూర్యుని యొక్క హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తుంది.
జీర్ణక్రియలో సహాయపడుతుంది:
మనం తీసుకున్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణం అవ్వడానికి రాగి నీరు తోడ్పడుతుంది. అజీర్తి నుండి మనల్ని కాపాడుతుంది అంతే కాకుండా కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ వున్నా వాటిని నయం చేస్తుంది.
వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది:
మానవ శరీర కణాల పునరుత్పత్తికి రాగి నీరు దోహదపడుతుంది. చర్మంపై హానికరమైన ప్రభావాల నుండి కాపాడుతుంది .అంతేకాకుండా మొహం పై వచ్చే ముడతలని తగ్గిస్తుంది.
నీటిని సుమారుగా 6 నుండి 8 గంటల వరకు నిల్వ ఉంచి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. రాగి నీరుని ఖాళీ కడుపుతో అనగ వేకువజామున త్రాగాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే రాగి నీరులో ఎప్పుడు నిమ్మకాయ రసాన్ని కలిపి తాగవద్దు మరియు వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచరాదు.
మరిన్ని చదవండి.
Share your comments