సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల పానీయాలు తయారు చేసుకొని తాగుతాము. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం వివిధ రకాల పానీయాలను తాగుతున్నారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది వెల్లుల్లి టీ.వెల్లుల్లి టీ తాగడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిని గత కొన్ని సంవత్సరాల నుంచి మనం వంటల్లో ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నాము.
వెల్లుల్లి కేవలం వంటకు రుచి ఇవ్వడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ముఖ్యంగా యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లిని తినటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడటంమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి కూడా దోహదం చేస్తుంది.
గుండె జబ్బులు, క్యాన్సర్ , ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వెల్లుల్లితో టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణ టీ కన్నా, వెల్లుల్లి టీని తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు తొలగించడంలో వెల్లుల్లి టీ ఎంతో దోహదపడుతుంది.
వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు మన శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి టీ తాగటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, శరీర బరువును నియంత్రించడానికి దోహదం చేస్తుంది. అలాగే రక్తప్రసరణను వేగవంతం చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.
ఉదర సమస్యలతో బాధపడేవారు, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి టీ తాగటం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వెల్లుల్లి టీ ఘాటుగా ఉంటుందని భావించేవారు వెల్లుల్లి టీ లోకి కొద్దిగా తేనె కలుపుకుని తాగినా ఈ విధమైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు.
Share your comments