దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకతో గత నెల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు సైనస్ మరియు ఇతర వ్యాధులు ప్రభలమవుతాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త పాటించడం చాలా అవసరం. వ్యాధి సోకిన వెంటనే సరైన నివారణ చర్యలు పాటించడం ద్వారా వ్యాధి తీవ్రత ఎక్కువవకుండా జాగ్రత్త పడవచ్చు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ వ్యాధులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సాధారణంగా వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువుగా ఉంటుంది దీనితో, శరీరంలో విటమిన్- డి తగ్గిపోతుంది. విటమిన్- డి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో సహాయపడుతుంది, ఈ విటమిన్ లోపం కారణంగా రోగాల భారిన పడే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, మరియు చికెన్‌గున్యా వంటి విషపు జ్వరాల తీవ్రత ఎక్కువవుతుంది. ఈ వైదులన్నీ దోమల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ రోగాల భారిన పడితే తిరిగి కోల్కోవడానికి తిరిగి చాలా సమయం పడుతుంది, కొన్ని సమయాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబ్బటి ఈ వ్యాధుల పట్ల అప్రమత్తత వహించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే జ్వరం ఎక్కువరోజులపాటు ఉన్నట్లైతే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్సలు పొందవలసి ఉంటుంది.
వర్షాకాలంలో వాతావరణంలోని తేమ ఎక్కువగా ఉంటుంది, దీనితో ఉపిరితిత్తుల సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆస్తమా ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, వర్షంలో తడవడం వంటివి చెయ్యకూడదు. తరచూ చేతులను శుభ్రపరచుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు మరియు వృద్దులు ఈ సమయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
వర్షాకాలంలో సైనస్ సమస్య ఎక్కువుగా బాధిస్తూ ఉంటుంది. సైనస్ వలన ఎల్లపుడు ముక్కు కారడం మరియు ముక్కు రంద్రాలు మూసుకుపోవడం దీని యొక్క లక్షణాలుగా ఉంటాయి. ముక్కు కారడం మరియు తలపోటు కారణంగా పని మీద దృష్టిపెట్టడం పెట్టలేరు. ఇటువంటి సమయంలో తరచూ ఆవిరి పట్టడం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. వర్షాకాలంలో సైనస్ సమస్య ఉన్నవారు చల్లని పానీయాలను సేవించకూడదు. కాచి చల్లార్చిన నీళ్లు లేదా గోరు వెచ్చని నీళ్లు మాత్రమే తీసుకోవాలి. వేడి నీళ్లు తాగడం వలన మూసుకుపోయిన ముక్కు రంద్రాలు తెరుచుకుంటాయి. దీనితోపాటు మద్యం అలవాటు ఉన్నవారు ఈ సమయంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే చల్లని నీటితో తలస్నానం కూడా చెయ్యకూడదు. ఈ విధంగా అన్ని రకాల చర్యలు పాటించడం ద్వారా ఈ సీజన్లో అంటువ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.
Share your comments