2019 లో వచ్చిన కోవిడ్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టించింది. కొన్ని లక్షల మంది జనం ఈ కోవిడ్ భారిన పడి తమ ప్రాణాలు కోల్పాయారు. ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసిన ఈ వైరస్ ఇప్పుడు ఒక పీడ కలలా మర్చిపోతున్న సమయంలో, మరొక్క షాక్ ఎదురుఅయ్యింది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కటి ఒక్కటిగా కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా చిన్న మరియు మధ్యస్థమైన వయసు ఉన్నవాళ్లో, ఈ సింటమ్స్ ఎక్కువగా కనబుతున్నాయి. హఠాత్తుగా వస్తున్న గుండె పోట్లు, ఉపిరి పీల్చుకోవడంలో సమస్యలు, కోవిడ్ తరవాతి పరిణామాలగా వైద్యులు, శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ భారిన పడిన వ్యక్తులను జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేసారు. ముఖ్యంగా, గుండెకు స్ట్రైన్ కలిగించే పనులు చెయ్యకూడదు.
వెల్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వాళ్ళు జరిపిన, ఒక తాజా అధ్యనయం ప్రకారం, కోవిడ్ నుండి కోలుకున్న వారిలో ఎక్కువ ఉపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి అని వారు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు, ఆయాసం, దగ్గు, ముఖ్యమైన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్యలకు పెరుగుతున్న వాయు కాలుష్యం, మరియు ఇతర ఆహారపు అలవాట్లు కూడా కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికి ఆరోగ్యం పై తగిన శ్రద్ధ తీసుకోవడం ఎంతో కీలకం.
నీరు తాగడం వాళ్ళ కలిగే ప్రయోజనాలు
ఇతర దేశాల ప్రజలతో పోలిస్తే, భారత దేశ ప్రజల్లో ఎక్కువ లక్షణాలు గమనించాం అని ఈ అధ్యయనం జరిపిన పరిశోధకులు డీ. జె. క్రిస్టోఫెర్ తెలిపారు. 207 మంది కోవిడ్ నుండి కోలుకున్న వారిలో ఈ అధ్యయనం జరపగా, వారిలో 49.% శ్వాశ సంబంధిత సమస్యలతో, 27. 1% దగ్గుతో భాదపడుతున్నట్టు ఈ అధ్యయనంలో తెలిపారు. అయితే కోవిడ్ కారణంగానే ఈ లక్షణాలు అన్ని వారిలో కనిపించాయి అని బలంగా చెప్పలేకపోతున్నారు, వారిలో ముందు నుండే ఉన్న ఆరోగ్య మరియు శ్వాశకోశ సమస్యలు వీటికి కారణం కావచ్చు.
ఇటలీ మరియు చైనా దేశాల్లో ఇలాంటి అధ్యయనలు జరుగగా, ఇటలీ రిపోర్ట్స్ ప్రకారం ఈ సంఖ్య, శ్వాశ తీసుకోవడంలో 43% గాను, దగ్గు తో బాధపడేవారు 20% గాను ఉంది, ఇండియా తో పోల్చుకున్నటు ఐతే ఈ సంఖ్య తక్కువ.
Share your comments