ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులు అనే వ్యత్యాసం లేకుండా, ప్రతి ఒక్కరూ స్నేహితులతో కలిసి పబ్బులకు పార్టీలకు వెళ్లడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే మహిళలు కూడా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా మద్యపానానికి అలవాటు పడటం వల్ల ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు మద్యపానానికి బానిస కావడం వల్ల వారు సంతానాన్ని కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్ మహిళల్లో గర్భధారణ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఫలితంగా మహిళలు గర్భం దాల్చలేరు. ఒకవేళ గర్భధారణ జరిగినా పలు కారణాల వల్ల వారికి గర్భస్రావం కలుగుతుంది. సాధారణంగా మహిళలకు గర్భధారణ జరగాలంటే వారిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కీలక పాత్ర వహిస్తాయి. సాధారణంగానే మనం తీసుకొనే ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి గర్భధారణ నిదానంగా జరుగుతుంది. అలాంటిది మద్యపానం చేయడం వల్ల ఈ హార్మోన్ల పై అధిక ప్రభావం పడుతుంది.
మహిళలు ఎక్కువగా మద్యపానం సేవించడం వల్ల కేవలం గర్భధారణ విషయంలో మాత్రమే కాకుండా వారి అండాశయం పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే నెలసరి సమయంలో సక్రమంగా రాకపోవడం వంటివి జరుగుతాయి. మహిళలు ఎక్కువగా మద్యం సేవించడం వల్ల ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పలు అధ్యయనాల ద్వారా వెల్లడించారు. పిల్లలు కావాలనుకునే దంపతులు పూర్తిగా మద్యపానానికి దూరంగా ఉన్నప్పుడే వారికి సంతాన ఫలం కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
Share your comments