ఇప్పటివరకు ఎండలతో మండిపోయిన రాష్ట్రాలకు వర్షాకాలంతో కాస్త ఉపసం లభించింది, అయితే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు మరియు అంటువ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ సమయంలో జలుబు, దగ్గు, మరియు కంటి ఇన్ఫెక్షన్ల వంటివి సర్వసాధారణం. శరీరంలో వేరే ఏ భాగానికైనా సమస్య వస్తే తట్టుకోగలమేమో కానీ కళ్ళకు ఇన్ఫెక్షన్లు వస్తే మాత్రం చాలా కష్టం. సర్వేంద్రియానం నయనం ప్రదానం అన్నారు, కాబ్బటి వర్ష కాలంలో కళ్ళను ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా రక్షించుకోవడం చాలా అవసరం.
కండ్ల కలకలు:
వర్షాకాలంలో కంటికి వచ్చే సమస్యల్లో కండ్ల కలక ఒకటి. కళ్ళు ఎర్రగా మారిపోవడం, దురద, మరియు కళ్ళలో మంట కండ్ల కలకల యొక్క ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియా, వైరస్ మరియు ఏదైనా అల్లెర్జి వలన కూడా సంభవించవచ్చు. ఈ కండ్ల కలకలు వాటంతట అవే తగ్గిపోతాయి, అయితే ఈ సమస్య ఉన్నన్నినాళ్ళు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. దీనిని నివారించడానికి తరచూ కళ్ళని కడుక్కోవాలి, అలాగే కళ్ళను తాకకూడదు. వర్షాకాలంలో శరీర శుభ్రతను పాటిస్తే కళ్ళ కలకల నుండి కాపాడుకోవచ్చు.
హార్డియోలం:
దీనినే కంటి కురుపు అని కూడా పిలుస్తారు. ఇది కనురెప్పల అంచున వచ్చి ఎంతో నొప్పిని మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎర్రలని కురుపు లాగా ఏర్పడి కనురెప్పలు మూసుకుపోయేలా చేస్తుంది. అయితే ఈ కంటి కురుపు ఎలా ఏర్పడుతుందంటే, రక్తంలోని తెల్ల రక్త కణాలు మరియు సంక్రమణ చీము లాగ ఏర్పడుతుంది. హార్డీయోలం రాకుండా ఉండేందుకు, కంటి శుభ్రతతో పాటు శారీరిక శుభ్రతను కూడా కాపాడుకోవాలి. తువ్వాలు మరియు వ్యక్థగథా వస్తువులు పంచుకోకూడదు.
యువెటిస్:
కంటి మధ్యలో ఉండే పొరనే యువెటిస్ అని పిలుస్తారు. ఈ పొర ఉబ్బడం వలన యువెటిస్ సమస్య వస్తుంది. ఈ సమస్య రావడానికి , కంటి ఇన్ఫెక్షన్లు, మరియు గాయాల వలన రావొచ్చు. కొన్ని సార్లు ఆటోఇమ్యూన్ డిసార్డర్ వలన కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. యువెటిస్ కి సొంత వైద్యం పనికిరాదు, కంటి డాక్టరును సంప్రదించి ఈ వ్యాధిని నివారించుకోవాలి.
ఫంగల్ ఇన్ఫెక్షన్:
వర్షకాలంలో వాతావరణంలోని తేమ ఎక్కువుగా ఉంటుంది. తేమ మరియు వేడి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణమవుతాయి. ఈ ఇన్ఫెక్షన్లు కళ్ళలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ రాగానే దీనికి తగిన చికిత్స చెయ్యించాలి లేకుంటే తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.
Share your comments