ఈ డిజిటల్ యుగంలో దాదాపు అన్ని పనులకు చేతిలో సామర్ట్ఫోన్ ఉంటె సరిపోతుంది. సామర్థ్ఫోన్ మన అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకువచ్చి అన్ని పనులను సులభతరం చేసింది. అయితే స్మార్ట్ఫోన్ లేదా డిజిటల్ గాడ్జెట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలున్న వాటి ద్వారా కలిగే నష్టం లేకపోలేదు. సామర్ట్ఫోన్ వినియోగం ఎక్కువగా ఉండటం వలన కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ప్రస్తుతం కళ్ళజోడు ప్రతిఒక్కరి జీవితంలోను ఒక భాగమైపోయింది. పెద్దవారినుండి చిన్నపిల్లవరకు దృష్టిలోపాలు ఎక్కువవ్వడం మూలాన తప్పనిసరిగా కళ్ళజోడు వాడవలసి వస్తుంది. ఈ కళ్ళజోడు వాడవలసి రావడానికి ప్రధాన కారణం, ఎక్కువసేపు టీవీ ల ముందు కూర్చువడం, సామర్ట్ఫోన్ వినియోగించడం, ఇంకా ఉద్యోగస్తులైతే కంప్యూటర్ల ముందు రోజంతా గడపడం, మొదలైనవి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటి మూలాన కళ్ళు పొడిబరాడం, మంటలు రావడం, మసకబారడం మొదలైన లక్షణాలు కనిపించవచ్చు ఇటువంటి సమయంలో కళ్ళజోడు వాడవలసి ఉంటుంది. అయితే చాల మందికి కళ్లజోడును వాడటం ఇష్టం ఉండదు. అటువంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తూ తమ కళ్లజోడును దూరం పెట్టవచ్చు.
కళ్ళు ఆర్పడం:
సాధారణంగా లాప్టాప్ ముందు లేదా సినిమా హాల్ లో కూర్చున్నపుడు అదే పనిగా స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. ఇలా చెయ్యడం మంచిది కాదు. అదేపనిగా స్క్రీన్ వైపు కళ్ళు ఆర్పకుండా తదేకంగా చూడకుండా, కనీసం 2 సెకెన్లకు ఒకసారైనా కనురెప్పలు ఆడిస్తూ ఉండాలి. కళ్ళు అలసిపోకుండా ఒక నిమిషం పాటు కళ్ళ రెప్పలు మూసి ఉంచాలి. ఇలా కనీసం రోజుకు 5-6 సార్లు చెయ్యాలి.
కంటి ఎక్సర్సైజ్:
శరీరానికి వ్యాయామం ఎలాగైతే అవసరమో కంటి కూడా అదేవిధంగా వ్యాయామం అవసరం. దీని కోసం కాంతిని సవ్యదిశ మరియు అపసవ్య దిశలో తిప్పాలి. ఈ వ్యాయామాన్ని కనీసం రోజుకు రెండు మూడు సార్లైనా చెయ్యాలి.
కళ్ళని కడగాలి:
ప్రస్తుతం గాలి మొత్తం కలుషితం అయ్యింది. గాలిలోని దుమ్ము మరియు ధూళి కళ్ళలోకి చేరి, కళ్ళు మంటా రావడానికి కారణం అవుతుంది. దీనికోసం రోజులో వీలైనప్పుడల్లా కంటిని నీటితో కడగాలి. ఇలా చెయ్యడం ద్వారా కంటిలోని దుమ్ముధులి బయటకి పోవడంతోపాటు కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
పామింగ్:
కంటిచూపు మెరుగుపర్చడంలో పామింగ్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఉదయాన్నే నిద్రలేవగానే రెండు అరచేతులు బాగా రుద్ది, కాళ్ళమీద ఉంచాలి. రెండు అరచేతుల్ని రుద్దడం వలన ఉత్పత్తయిన వేడి కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇలా రోజులో కనీసం 4-5 సార్లు చేస్తే మంచిది.
ఆహారం:
వీట్నితోపాటు కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన తినే ఆహారంలో విటమిన్-ఏ, ఉండేలా చూసుకోవాలి, క్యారెట్, బీట్రూట్, మొదలైనవి ఆహారంలో చేర్చుకోవాలి. వీటితోపాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినడానికి ప్రయత్నించాలి. వీటితోపాటు జింక్, విటమిన్-సి,ఇ వంటి పోషకాలు ఉండే ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి.
Share your comments