పన్నీర్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారివరకు అందరికి పన్నీర్ తో చేసిన వంటలంటే ఎంతో ఇష్టం. పన్నీరులో పోషకవిలువలు కూడా ఎక్కువే, మాంసాహారం తిననివారికి పన్నీర్ ఒక చక్కటి ప్రోటీన్ ప్రత్యామ్న్యాయం. అయితే మార్కెట్లో మనకు సహజంగా దొరికే పన్నీర్ కల్తీదై ఉండచ్చు. దీనిని కనిపెట్టడానికి కొన్ని మార్గాలున్నాయి వాటిగురించి ఇప్పుడీ తెలుసుకుందాం.
పన్నీర్ రుచితోపాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది, దీని ఆరోగ్య విలువ గ్రహించడం వలన ఈ మధ్య కాలంలో పన్నీర్ వినియోగం పెరిగింది. అయితే ఇంట్లోనే పన్నీర్ ను తయారుచేసుకోవచ్చు, కాకపోతే దీనికి శ్రమ మరియు సమయం కావాలి, అందుచేత ప్రజలు మార్కెట్లో దొరికే పన్నీరునే ఎక్కువుగా ఉపయోగిస్తుంటారు. పన్నీరుకు మార్కెట్లో ఉన్న డిమాండ్ గుర్తించిన కొందరు కేటుగాళ్లు నకిలీ పన్నీర్ విక్రయిస్తూ ప్రజల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
అంతేకాకుండా ఆహారవర్తకులు కూడా నకిలీ పన్నీర్ ఎక్కువుగా ఉపయోగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బయట తినే పన్నీర్ నిజమైనదో, నకిలీదో తెలుసుకోవడం కష్టమే, కానీ ఇంట్లో వండుకోవడానికి కొనుకున్న పన్నీర్ కల్తీదా? మంచిదా? అన్న విషయాన్ని కొన్ని పద్దతుల ద్వారా తెలుసుకోవచ్చు.
ముందుగా కొన్ని పన్నీర్ ముక్కలను ఒక పాత్రలో వేసి నీరు పోసి వేడి చెయ్యాలి. తరువాత ఈ నీటిలో నాలుగు చుక్కల అయోడిన్ వెయ్యాలి. ఇలా చేసినప్పుడు కల్తీ పన్నీరైతే తెలుపు రంగునుండు నీలం రంగులోకి మారుతుంది. పన్నీర్ ఎక్కువకాలం నిలువ ఉంచడానికి కొందరు వర్తకులు అధిక మొత్తంలో యూరియా కలుపుతారు, ఇది ఆరోగ్యానికి హానికరం. అయోడిన్ టెస్ట్ ద్వారా యూరియా కలిసిందో లేదో తెలుసుకోవచ్చు. మరో పద్దతేంటంటే పన్నీర్ ను నీటిలో ఉడికించి తర్వాత చల్లని నీటిలో వెయ్యాలి, ఇప్పుడు అదే నీటిలో కందిపప్పును వేసి, 10 నిముషాలు కదపకుండా ఉంచాలి, పన్నీర్లో కల్తీ ఉంటే నీరు లేత ఎరుపురంగులోకి మారుతుంది.
పన్నీర్ కొనేముందు అది సరైనదో కాదో ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకోవడం కీలకం. కంపెనీ ప్యాకేజీ మీద ఉన్న ముద్రను గమనించి, ఎక్సపైరి కానీ పన్నీరును మాత్రమే కొనుగోలుచెయ్యాలి.
Share your comments