ఈ మధ్య కాలంలో ప్రోటీన్ పౌడర్ వినియోగం పెరిగింది. ముఖ్యంగా జిమ్ కు వెళ్లే వారు ప్రోటీన్ పౌడర్ వాడటం చూస్తాం. ప్రోటీన్ పౌడర్ వినియోగం పెరగడంతో, అనేక కంపెనీలు ప్రోటీన్ పౌడర్ విక్రయించడం మొదలు పెట్టాయి. ఇదే అదనుగా చేసుకున్న కొంతమంది మార్కెట్లో నకిలీ ప్రోటీన్ పౌడర్ విక్రయించడం మొదలుపెట్టారు. వీటిని తక్కువ ధరకే అందించడం వలన వినియోగదారులు వీటిని కొని మోసపోయే అవకాశం ఉంది. వీటిని వినియోగించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అధికంగా వ్యాయామం చేసేవారిలో మసిల్ లాస్ అంటే కండరాలు నష్టం ఉంటుంది. కండరాలను తిరిగి నిర్మించేందుకు శరీరానికి ప్రోటీన్ అవసరం. మునుపటి రోజుల్లో వ్యాయామం చేసేవారు అధిక ప్రోటీన్లు అందిచే సహజసిద్దమైన ఆహారాన్ని తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆహారంతో పాటు తొందర మసిల్ బిల్డడింగ్ కోసం ప్రోటీన్ పౌడర్లను వినియోగిస్తున్నారు. వీటిలో శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ప్రోబైయటిక్స్, ఇతర ఖనిజాలు ఉంటాయి. ఇవి వ్యాయామం పూర్తయ్యాక మసిల్ బిల్డింగ్ లో తోడ్పడతాయి. ప్రోటీన్ పౌడర్లకు డిమాండ్ పెరగడంతో కొందరు నకిలీ ప్రోటీన్ పౌడర్స్ మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వీటి ధర కూడా తక్కువ ఉండటంతో వినియోగదారులు వీటిని కొని మోసపోయే అవకాశం ఉంది.
ఇటువంటి నకిలీ ప్రోటీన్ పౌడర్లు గుర్తించడం కోసం ముందుగా, వీటి లబెల్స్ క్షుణంగా పరిశీలించండి, నకిలీ వాటి మీద పేర్లు మరియు అడ్రస్ అన్ని తప్పుగా లికించబడి ఉంటాయి. మార్కెట్ లో కొన్ని ప్రశిద్ధ బ్రాండ్ల ప్రోటీన్ పౌడర్ల ప్యాకేజింగ్ మరియు స్టికరింగ్ కాపీ చేసి వాటిని నకిలీ ప్రోటీన్ పౌడర్లకు అతికించి విక్రయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశిద్ధ బ్రాండ్లకు సర్టిఫికేషన్ మరియు స్టాంపింగ్ వివరాలను లేబిల్ మీద ముద్రిస్తారు, ఇలా స్టాంపింగ్ లేదా లోగో లో ఏమైనా తేడాలు కనిపిస్తే అవి నకిలీవని గుర్తించాలి.
అంతేకాకుండా నకిలీ ప్రోటీన్ పౌడర్ రంగు, రుచిలో కూడా, సాధారణ ప్రోటీన్ పౌడర్ కంటే వ్యత్యాసం చూపుతాయి. వీటి వాసన కూడా విభిన్నంగా ఉండటం గమనించవచ్చు. నకిలీ ప్రోటీన్ పౌడర్లు కొని మోసపోకుండా ఉండేందుకు, సర్టిఫైడ్ డీలర్ల దగ్గర నుండి కొనడం ఉత్తమం. చాల వరకు ఆన్లైన్ ప్లాటుఫామ్స్ లో ఈ నకిలీ ప్రోటీన్ పౌడర్లు విక్రయించే అవకాశం ఉంటుంది కనుక వినియోగదారులు శ్రద్ధ వహించాలి.
Share your comments