సాధారణంగా మన పెద్దవారు కొన్ని విషయాలలో అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే నియమాలను పెడుతూ ఉంటారు. అయితే వారు చెప్పిన విషయాలలో కొంతవరకు శాస్త్రీయంగా ఉన్న సైన్స్ పరంగా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి.మనం నిద్రపోయే సమయంలో ఎడమ వైపు తిరిగి పడుకోవాలి అని చెబుతారు.నిజంగానే ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల మన శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా మన జీర్ణవ్యవస్థ పై ఒత్తిడపడదు కనుక ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా దోహదం చేస్తుంది. మన శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడం వల్ల వెన్ను నొప్పి, వీపు నొప్పికి కూడా చెక్ పెట్టవచ్చు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం ద్వారా కాలేయం, కిడ్నీలు సక్రమంగా పని చేయడంతో పాటు శరీరంలోని విష పదార్ధాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు పడుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఎడమ వైపు పడుకోవడం వల్ల వారి జీర్ణాశయం పై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఈ క్రమంలోనే తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా చాతిలో మంట నొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా ఎడమవైపు పడుకోవటం వల్ల మెదడు చురుగ్గా పని చేయడమే కాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధులు కంట్రోల్ అవడానికి కూడా ఆస్కారం వుంటుంది.
Share your comments