మన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడంలో రక్తం సహాయపడుతుంది. అలాంటిది ఈ రక్త ప్రసరణ అనేది మన శరీరంలో బాగా జరిగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో రక్తం అనేది కణాల్లో కార్బన్ దయాక్స్డ్ మరియు ఇతర వ్యర్ధాలను తొలగించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా రోజువారీ వ్యవహారాల్లో భాగంగా దెబ్బతినే కణజాలను కూడా రక్తమే రిపేర్ చేస్తుంది. వ్యర్ధాలు మన రక్తంలో అధికంగా ఉంటె అనేక రకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అనేక చర్మ సంబంధిత సమస్యలైనా దద్దుర్లు, అలర్జీలు, దురదలు, వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రక్తశుద్ధి అనేది తప్పనిసరి.
వేప:
వేప అనేది మన రక్తంలో మలినాలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుందని ఆయుయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. ఈ వేపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వేప అనేది రక్తం గడ్డ కట్టకుండా మరియు మన లివేర్ను డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. చర్మ వ్యాధులు, అల్సర్లు, కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాలకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. వేప పొడి గోరు వెచ్చని నీళ్లలో వేసుకుని తాగితే మంచిది.
మంజిష్ఠ:
మంజిష్ఠ అనేది వేపలా చేదుగా ఉండే ఆస్ట్రిమ్జెంట్ హెర్బ్. మంజిష్ఠ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా సహాయపడుతుంది. ఇది రక్తంలోని వ్యర్ధాలను కూడా తొలగిస్తుంది. మన శరీరంలో రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడానికి మంజిష్ఠ ఉపయోగపడుతుంది. మంజిష్ఠ రసాన్ని 10-30 మిల్లీమీటర్లు తీసుకుని .. దానికి సమాన పరిమాణంలో నీటిని కలిపి, షుగర్ పేషేంట్లు తీసుకుంటే చాల మంచిది. దీనిని రోజుకు రెండు సార్లు తాగావచ్చు.
ఇది కూడా చదవండి..
మిల్క్ సైడ్ ఎఫెక్ట్స్: పిల్లలకు పాలతో పాటు ఈ రకమైన ఆహారాన్ని ఇవ్వకండి
తిప్పతీగ:
తిప్పతీగ చాలా శక్తివంతమైన ఆరేయుర్వేద మూలిక. ఇది అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది రక్తం శుద్ధి చేయడంలోనూ బాగా పనిచేస్తుంది. తిప్పతీగ రక్తం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. అధేవిధిగా ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది. దీనిని పొడి చేసుకుని గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగితే మంచిది.
తులసి:
తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ మనం ఖాళీ కడుపుతో నాలుగు తులసి ఆకులు తింటే రక్తం క్లీన్ అవుతుంది. తులసి ఆకులలో ఆక్సిజన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. దీనితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.
ఇది కూడా చదవండి..
మిల్క్ సైడ్ ఎఫెక్ట్స్: పిల్లలకు పాలతో పాటు ఈ రకమైన ఆహారాన్ని ఇవ్వకండి
ఉసిరి:
ఉసిరి అనేది బ్లడ్ ప్యూరీఫైర్ గా పనిచేస్తుంది. మన శరీరంలో హానికరమైన టాక్సిన్స్ ను బయటకి పంపటానికి సహాయపడుతుంది. ఉసిరి రసాన్ని తరచుగా తీసుకుంటే హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణల సంఖ్య పెరుగుతుంది.
పసుపు:
పసుపులో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయ. ఇది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ శరీరంలోని అనేక సమస్యలతో పోరాడటంలో సహాయపడుతుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. ఈ పాలు రక్తాన్ని క్లీన్ చేస్తాయి.
ఇది కూడా చదవండి..
Share your comments