కరివేపాకును చాలామంది చులకనగా చూస్తారు. కూరలో కరివేపాకు కనిపిస్తే వెంటనే తీసి పక్కన పడేస్తారు. అంతేకాదు నువ్వు కూరలో కరివేపాకులా అని మనుషులను కరివేపాకుతో పోలుస్తూ కించపరుస్తూ ఉంటారు. కొంతమంది కూరలో కరివేపాకును అంత సులువుగా పరిగణిస్తారు. ఈ ఆకు తింటే ఏమోస్తాదిలే అని కూరలో కనిపించగానే తీసి పడేస్తారు. చాలామంది కరివేపాకును తినడానికి అసలు ఇష్టపడరు. అయితే కరివేపాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే.. ఇంకోసారి దానిని వదిలేయరు.
ఇంతకు కరివేపాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకు వల్ల మన కూరకు మంచి టేస్ట్ రావడంతో పాటు సువాసన వస్తుంది. కరివేపాకు వేయకపోతే కూరకు అసలు టేస్ట్ రాదు. ఇక కరివేపాకు తినడం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. శరీరంలోని విషవ్యర్ధాలు బయటకు వస్తాయి. జీర్ణవ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ఇక విరేచనాల సమస్యను కరివేపాకు పరిష్కరిస్తుంది. ఇక కరివేపాకు దగ్గు, జలుబును దూరం చేస్తుంది.
ఇక కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఇక డయాబెటిస్ ఉన్నవారికి కరివేపాకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుతాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. ఇక కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకుల్ని ఉడకబెట్టి ఆ నీళ్లు తాగాలి. ఇలా చేస్తే యూరినరీ సమస్యను తగ్గిస్తుంది. ఇక కరివేపాకు తినడం వల్ల జుట్టు తెల్లబడడు. జుట్టు బాగా పెరిగేందుకు కూడా కరివేపాకు ఉపయోగపడతాయి.
ఇక శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కరివేపాకు బాగా ఉపయోగపడతాయి. అలాగే కరివేపాకులో ఉండే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకు ఆకు రసం లేదా పేస్ట్ కాలిన తాగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. కరివేపాకు తినడం వల్ల అనీమియా తగ్గడంతో పాటు డయేరియాను తగ్గిస్తుంది. రోజూ కరివేపాకులు తింటే గుండె జబ్బులు రావట. కరివేపాకు తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయట.
ఇక రోజూకు రెండుసార్లు కరివేపాకు రసాన్ని తాగితే మూత్రపిండ సమస్యలు ఉండవని డాక్టర్లు చెబుతున్నారు. ఇక రోజూ ఆహారంలో కరివేపాకు తింటే బరువు తగ్గుతారట. కరివేపాకులో శరీరంలోని కొవ్వును తగ్గించే పదార్దాలు ఉంటాయి. దీంతో కరివేపాకు తింటే బరువు తగ్గే అవకాశముంది. కరివేపాకు జ్యూస్ తగ్గినా బరువు తగ్గవచ్చట. కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలే సమస్య ఉండదట.
Share your comments