సహజంగా చింతచిగురుని, దోరగా మాగిన చింతకాయలని రుచి చూడని వారంటూ ఎవరూ ఉండరు. చింత పండు రుచికి పుల్లగా ఉన్నప్పటికీ అందులో మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి.ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది.
చింతకాయలోఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ చింత గింజల్లో ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ విత్తనాలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. మొదట చింతగింజలను వేయించిన తర్వాత పొడి చేసుకోవాలి.పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్ చొప్పున పాలు లేదా నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
చింతగింజల పొడిని ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ కలిపి రోజుకి రెండుసార్లు తాగితే ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.చింత పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్‌వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన తొలగిపోతుంది.
చింతపండు విత్తనాల్లో యాంటీ క్యాన్సర్ గుణాలుంటాయి.క్యాన్సర్ ను నివారించడమే కాకుండా కోలన్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగు పరుస్తుంది.చింత గింజల్లో ఉండే పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
Share your comments