పనస పండ్లు.. ప్రకృతి మనకు అందించిన గొప్ప అద్భుతం. ఎందుకంటే పనసలో ఉంటే ఔషధ గుణాలు, పోషక విలువలు అలాంటివి మరి. పనస పండ్లను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయనీ, అందుకే వాటిని అందుబాటులో ఉంటే నిత్యం తీసుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పనస పండులో దాదాపు అన్ని రకాల విటమిన్లు ఉంటాయి. కాబట్టి పనసను తింటే శరీరానికి పుష్కలంగా విటమిన్లు అందుతాయి. ఇవే కాకుండా పనస పండు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పనస పండ్లులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయనీ, శరీర సంబంధ పలు అనారోగ్య ప్రభావాలను ఇది తగ్గిస్తుందని దీనిపై పరిశోధన జరిపిన పలువురు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పనస పండ్లల్లో అధిక మొత్తంలో యాంటీ అల్సరేటివ్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయనీ, దీని కారణంగా పనస తింటే అల్సర్లు దరిచేరవని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే, అల్సర్లను తగ్గించడంలో పనసలో ఉంటే ఔషధ గుణాలు కీలకంగా పనిచేస్తాయని అంటున్నారు. జీర్ణ క్రియను సైతం మెరుగుపరుస్తుంది. కడుపు సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి పనస పండ్లు అందుబాటులో ఉంటే తినాలని సూచిస్తున్నారు.
అందంగా కనిపించాలనుకునే వారికి పనస ఒక సౌందర్య సాధన సంజీవనిగా చెప్పవచ్చు. ఎందుకంటే చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఇది కాపాడుతుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. చర్మాన్ని సుకుమారం, కాంతివంతంగా చేయడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. శుక్లాల సమస్యకు పనస తినడం వల్ల చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే ఏ విటమిన్ తో పాటు కంటిని మేలు చేసే ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. పనసలో కొవ్వు పదర్థాలు తక్కువగా ఉంటాయి. కాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడే వారు దీనిని ఆహారంగా తీసుకుంటే సానుకూల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పనసను తింటే గుండె సంబంధ వ్యాధులు సైతం దరిచేరవు. ఇందులో ఉండే పోటాషియం రక్తపోటును సాధారణంగా ఉంచుతుంది.
Share your comments